బిగ్ బాస్ 3: కుమారి ఉందా.. కలిసొస్తుందా..?

0

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోగా.. హీరోయిన్ గా ఎక్కువకాలం కొనసాగడం కష్టమైన విషయం. లక్కు వర్క్ అవుట్ అయ్యి అవకాశాలు వచ్చినా.. హిట్స్ సాధించినా అంతటితో సెటిల్ అయ్యామని అనుకోలేరు. అందుకంటే హెబ్బా పటేల్ కు కూడా ఎన్నో అవకాశాలు వచ్చాయి. ‘కుమారి 21 F’ లాంటి సెన్సేషనల్ హిట్స్ కూడా ఆమె ఖాతాలో ఉన్నాయి. అయితే ఈమధ్య వరస ఫెయిల్యూర్లతో మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చింది.

ఈమధ్య చెప్పుకోదగ్గ ఆఫర్లు ఏమీ లేకపోవడంతో వెయిట్ తగ్గించి స్లిమ్ముగా మారింది. ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాలో మంటలు పెడుతోంది. అయినా అవకాశాలు హెబ్బా ఇంటి తలుపు తట్టకపోవడంతో ఇప్పుడు బిగ్ బాస్ 3 లో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. నిజానికి హెబ్బాకు గతంలోనే బిగ్ బాస్ లో పాల్గొనే ఆఫర్ వచ్చిందట. కానీ అప్పటికి తనచేతిలో ఒకటి రెండు ఆఫర్లు ఉండడంతో యాక్సెప్ట్ చేయలేదట. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బిగ్ బాస్ ఛాన్స్ ను మిస్ చేసుకోకూడదని డిసైడ్ అయిందట.

హిందీలో బిగ్ బాస్ తో చాలామంది కెరీర్లకు మంచి బూస్ట్ లభించింది కానీ తెలుగు బిగ్ బాస్ తో ఇంతవరకూ ఎవరికీ పెద్దగా ప్రయోజనం కలగలేదు. తేజస్వి మదివాడ.. నందిని రాయ్ లాంటివారు బిగ్ బాస్ హౌస్ లో తమ టాలెంట్ చూపించినా.. లైమ్ లైట్ లోకి వచ్చినా వారికి సీజన్ పూర్తయిన తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. మరి హెబ్బాకు నిజంగా బిగ్ బాస్ 3 అవకాశం వస్తే.. తను ఉపయోగపడుతుందో లేదో వేచి చూడాలి.
Please Read Disclaimer