కిర్రెక్కిస్తున్నహెగ్డే బ్యూటీ

0

సోషల్ మీడియా వేదికగా అందాల కథానాయికలు తమ ట్యాలెంట్ ని చూపించేందుకు ఏమాత్రం భేషజం చూపించడం లేదు. ఇన్ స్టా.. ట్విట్టర్ లో భారీగా ఫాలోవర్స్ ని పెంచుకునేందుకు నిరంతరం వేడెక్కించే ఫోటోలు- వీడియోల్ని షేర్ చేస్తున్నారు. టిక్ టాక్ ని భారత ప్రభుత్వం బ్యాన్ చేయడంతో ఇప్పుడు అందరికీ ఇన్ స్టా.. ట్విట్టర్.. ఎఫ్.బీలే కనిపిస్తున్నాయి. తాజాగా ‘కిర్రాక్ పార్టీ’ బ్యూటీ సంయుక్త హెగ్డే సోషల్ మీడియాకి కొత్తేమీ కాదు. అసలే ఈ అమ్మడు బెస్ట్ డ్యాన్సింగ్ ట్యాలెంట్ ఉన్న నటి. తనవైన డ్యాన్స్ వీడియోలతో నిరంతరం ఇన్ స్టాలో తన ఫాలోవర్స్ కి ట్రీటిస్తుంటుంది. తాజాగా సంయుక్త డ్యాన్స్ వీడియో ఒకటి అంతే వేగంగా అంతర్జాలంలో దూసుకెళుతోంది.

బెల్లీ డ్యాన్స్ – అక్రోబాటిక్ డ్యాన్స్ రెండిటినీ మిక్స్ చేసిన సరికొత్త డ్యాన్సింగ్ స్టైల్ తో సంయుక్త ఎక్సర్ సైజులు చేస్తున్న ఈ వీడియో సంథింగ్ హాట్ అనే చెప్పాలి. చైనా అథ్లెట్ ని తలపిస్తూ ఊపిరి ఆగిపోయేంతటి విన్యాసాలే చేసింది ఈ అమ్మడు. శరీరాన్ని బొంగరంలా తిప్పేస్తూ విల్లులా వంచేయడం చూస్తుంటే వామ్మోవ్ సంయుక్త! అనకుండా ఉండలేం. ఇలాంటి అద్భుతమైన నృత్యాన్ని ఆరాధించని వాళ్లుంలారా? డ్యాన్స్లో గొప్ప ప్రతిభ ఫ్లెక్సిబిలిటీ నిండిన బాడీ షేప్స్ ఈ అమ్మడికే సాధ్యం.

Have a kind heart, a fierce mind and a brave spirit 💛 . . . #practiceeveryday #musichealsmysoul #dancerlife #dancerlegs #samyukthahegde #thebarefeetchronicles #realnotperfect #goodmorning

null