అందమైన నటి గుండె ఆగిపోయేంత భయంకరంగా తయారైంది..చూసి తట్టుకోగలరా?

0

ప్రపంచవ్యాప్తంగా హాలోవీన్ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. సామన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు భయంకరమైన దుస్తులు వేసుకుని వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మన భారతీయ సెలబ్రిటీలు కూడా హాలోవీన్ గెటప్స్‌తో ఫ్యాన్స్‌ను బెదరగొడుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఘోరంగా, భయకరంగా తయారైన ఏకైక సెలబ్రిటీ జర్మన్ మోడల్, నటి హైదీ క్లమ్. 46 ఏళ్ల హైదీ ఎవ్వరూ ఊహించని హాలోవీన్ గెటప్‌ను ధరించారు. న్యూయార్క్ సిటీలో నిన్న 20వ హాలోవీన్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుకలకు ఎందరో సినీ ప్రముఖులు భయంకరమైన గెటప్స్ వేసుకుని వచ్చారు.

కానీ హైదీని వేసుకున్న గెటప్ చూసి చాలా మంది హడలిపోయారు. కొందరైతే అక్కడి నుంచి పారిపోయారు కూడా. పుర్రె, రొమ్ములు, పేగులు, నరాలు, ఎముకలు, రక్తం ఇలా అన్నీ బయటికి కనిపించేలా తయారు చేసిన రబ్బర్ డ్రెస్ వేసుకుని వచ్చారు. ఎన్నో గంటలు కదలకుండా కూర్చుంటే కానీ ఈ గెటప్‌ సరిగ్గా రాలేదట. హాలోవీన్ అంటేనే అత్యంత భయంకరంగా తయారవడం. ఆ విషయంలో హైదీ నూటికి నూరు మార్కులు తెచ్చుకున్నారు. ప్రపంచంలో అత్యంత భయంకరంగా తయారైన సెలబ్రిటీగా పేరు తెచ్చుకున్నారు. వేడుకకు హైదీ భర్త కూడా వచ్చారు. వ్యోమగామి గెటప్‌లో ముఖం అంతా రక్తం పూసుకుని వచ్చారు. పైగా తన భర్తను ముద్దుపెట్టుకుంటూ మీడియాకు పోజులిచ్చారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. పిల్లలు భయపడతారని, ఇలాంటి ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇంతకీ ఈ హాలోవీన్‌ను ఎందుకు జరుపుకుంటారంటే.. చనిపోయినవారిని గుర్తుచేసుకోవడానికి. మూడు రోజుల పాటు ఈ హాలోవీన్‌ను జరుపుకుంటారు. ఈ మూడు రోజులు వెజ్ తప్ప నాన్ వెజ్ ముట్టుకోరు. ఇలా చేస్తే చనిపోయినవారి ఆత్మ శాంతిస్తుందని క్రైస్తవుల నమ్మకం. ఇది రాను రాను సంప్రదాయం నుంచి ఓ టైంపాస్ ఫెస్టివల్‌గా మారిపోయింది. సోషల్ మీడియాలో లైక్స్ కోసమో, లేక పాపులారిటీ కోసం సెలబ్రిటీలు హాలోవీన్ గెటప్స్ వేసుకుంటున్నారు. క్రీస్తుపూర్వంలో మాత్రం దీనిని ఎంతో పవిత్రంగా జరుపుకునేవారు.

వీడియో:

 

View this post on Instagram

 

Still here 😳#heidiklumhalloween2019 #heidiklumhalloween

A post shared by Heidi Klum (@heidiklum) on
Please Read Disclaimer