నీకో దండం బాబు అని మళ్లీ ఎలా వెళ్లిందో?

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్స్ ను చూసిన సమయంలో చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు. ముఖ్యంగా హేమ మంచి బలమైన కంటెస్టెంట్ అంటూ అంతా భావించారు. కాని అనూహ్యంగా హేమ మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. ఎన్నో వందల సినిమాలు చేసిన హేమ మంచి స్టార్ డం ఉన్న హేమ కేవలం వారం రోజుల్లోనే బయటకు రావడంతో అంతా అవాక్కయ్యారు. ఆమెపై చాలా అంచనాలు పెట్టుకున్న వారు నోరెళ్లబెట్టారు.

హేమ బయటకు వచ్చిన తర్వాత నానా రచ్చ చేసింది. బిగ్ బాస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. బిగ్ బాస్ నిర్వాహకులు ముందే ఎవరిని ఎలిమినేట్ చేయాలంటూ జాబితా సిద్దం చేసుకుంది.. ఓట్లతో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా వారు ఎలిమినేట్ చేస్తూ వస్తున్నారు. అసలు బిగ్ బాస్ షో జెన్యూన్ గా సాగడం లేదు అంటూ ఇష్టానుసారంగా హేమ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. బిగ్ బాస్ షో డైరెక్టర్స్ శ్రీముఖికి మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఇంకా హౌస్ లో ఉన్న ఫైనలిస్ట్ లపై కూడా చాలా విమర్శలు చేసింది.

వారం రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో హేమ మాట్లాడుతూ ఫైనల్ ఎపిసోడ్ కు నన్ను ఆహ్వానించారు. కాని నీకో దండం బాబు.. నీ షో కు ఒక దండం నేను రాను అంటూ చెప్పానని పేర్కొంది. కాని నేడు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ లో హేమ సందడి చేయబోతుంది. సీజన్ 1 మరియు సీజన్ 2లకు ఎలా అయితే ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులను మళ్లీ లోనికి పంపించారో అలాగే ఇప్పుడు కూడా నేటి ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన వారంతా కూడా వచ్చేశారు. బాబోయ్ నీకో దండం అంటూ వ్యాఖ్యలు చేసిన హేమ ఎలా వచ్చారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

హేమ రాకపోవచ్చు.. తమన్నా కనిపించడం లేదు కనుక ఆమె వస్తుందో రాదో అనే అనుమానం ఉండే. కాని హేమ.. తమన్నాలతో పాటు అంతా కూడా షో కు హాజరు అయ్యారు. వెళ్లి పోయిన ఇంటి సభ్యుల రాకతో ఫైనలిస్ట్ గా ఉన్న వారి ఆనందంకు అవధులు లేకుండా పోయాయి. నేటి ఎపిసోడ్ అంతా సందడి సందడిగా సాగబోతుంది. ఇక మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 3 కి ఎండ్ కార్డ్ పడబోతుంది. ఫైనల్ ఎపిసోడ్ అంటే ఆదివారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ లో కూడా వీరంతా కూడా పాల్గొనబోతున్నారు. ఆ రోజు కూడా హేమ వచ్చే అవకాశాలున్నాయి.
Please Read Disclaimer