బయటకొచ్చేసిన హేమ.. ఎవరికేం చెప్పారంటే?

0

బిగ్ బాస్ సీజన్ 3లో తొలి ఎలిమినేషన్ అయిన హేమ.. ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ఈ సందర్భంగా ఇంట్లోని హౌస్ మేట్స్ మీద ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను హౌస్ లో ఉన్నప్పుడు వ్యవహరించిన శైలిపై విమర్శలు వెల్లువెత్తిన వేళ.. ఆ అంశాలపై వివరణ ఇచ్చిన ఆమె.. ఇంట్లోని 14 మంది సభ్యులపై ఆమె తన అభిప్రాయాల్ని వెల్లడించారు.

మహేశ్ మంచోడే కానీ మాటలు మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలన్నారు. గట్టి పోటీ ఇస్తున్నట్లుగా భావిస్తున్న శ్రీముఖి.. హిమజలకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. శ్రీముఖి చివరి వరకూ నిలుస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అషూరెడ్డిని స్వీట్ హార్ట్ గా అభివర్ణించిన హేమ.. ఆమె విషయంలో బిగ్ బాస్ కాస్త టైమ్ ఇవ్వాలన్నారు. అలీ బాగా ఆడుతున్నారని చెప్పారు.

కొంచెం కోపం తగ్గించుకోవాలని రాహుల్ కు సూచన చేసిన హేమ..వితికా.. వరుణ్ లు హౌస్ లో ఉండాలని అందరూ కోరుకుంటున్నారని చెప్పారు. ఇదే విషయాన్ని నాగార్జున చెప్పినప్పుడు వరుణ్ అప్పుడప్పుడు హౌస్ మేట్స్ కు కాంప్లిమెంట్స్ ఇవ్వాలన్నారు. టాస్క్ లో భాగంగా టీచర్ గా బాగా యాక్ట్ చేసిన పునర్నవిని మెచ్చుకున్న హేమ.. రవికృష్ణ మంచోడని మాట్లాడే వేళ జాగ్రత్తగా ఉండాలన్నారు.

రోహిణి అందరిని నమ్మేస్తుందని.. హౌస్ లో అలా ఉండకూడదన్న హేమ.. టీవీ9 జాఫర్ గురించి మాట్లాడుతూ.. ఇంటిపై బెంగ పెట్టుకోవద్దని హౌస్ లో ఇంకా ఉండాలన్నారు. ఇంటి సభ్యుల బాధ్యతను హేమ తన నుంచి బాబా భాస్కర్ కు అప్పజెప్పారు. ఈ సందర్భంగా హేమ గురించి బాబా చెబుతూ.. ఆమె తనకు వంటలో చిట్కాలు నేర్పారని.. ఇంటికి వెళ్లాక అవి వండి.. తన భార్య దగ్గర మంచి పేరు తెచ్చుకుంటానని చెప్పారు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home