బిగ్ బాస్ ఆహ్వానానికి ఓ దండం

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 లో మొదటి వారంలోనే హేమ ఎలిమినేట్ అయిన విషయం తెల్సిందే. ఆమె బలమైన కంటెస్టెంట్ అని.. ఖచ్చితంగా ఆమె కనీసం నాలుగు అయిదు వారాలు అయినా ఉంటుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు. కొన్ని వందల సినిమాల్లో నటించి మెప్పించిన హేమ మొదటి వారంలోనే ఎలిమినేట్ అవ్వడం తో అంతా అవాక్కయ్యారు. ఆమె బిగ్ బాస్ మొదటి వారం ఎలిమినేషన్ అస్సలు మింగుడు పడటం లేదు. అందుకే అప్పటి నుండి కూడా ఆమె వీలు కలిగినప్పుడల్లా బిగ్ బాస్ పై విమర్శలు చేస్తూనే ఉంది.

బిగ్ బాస్ లో శ్రీముఖి సేఫ్ గేమ్ ఆడుతుందని.. ఆమె చెప్పేది ఒకటి మనసులో ఉండేది మరోటి అంటూ తీవ్ర విమర్శలు చేసింది. ప్రస్తుతం ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ విషయంలో పలు అనుమానాలు తనకు ఉన్నట్లుగా సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ ప్రేక్షకులకు కేవలం చెడును మాత్రమే చూపిస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అందుకే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఫేమస్ అయినా విన్నర్ అయినా కూడా బయటకు వచ్చిన తర్వాత పెద్దగా స్టార్స్ అవుతున్న దాఖలాలు లేవని హేమ చెప్పుకొచ్చింది.

ఫైనల్ ఎపిసోడ్ లో పాల్గొనేందుకు రావాల్సిందిగా బిగ్ బాస్ నిర్వాహకులు తనకు ఆహ్వానం పలికారు. కాని తాను ఆ ఆహ్వానాన్ని తిరష్కరించాననంది. మీ ఆహ్వానానికో దండం అన్నానని హేమ చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ నుండి ఎవరు ఎలిమినేట్ అయ్యేది ముందే నిర్ణయం జరుగుతుందని ప్రేక్షకుల ఓట్ల ప్రకారం ఈ ఎలిమినేషన్ సాగలేదు. బిగ్ బాస్ ఎడిటర్స్ పెద్ద బిగ్ బాస్ అని వారు కేవలం చెడును చూపించి టీఆర్పీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ హేమ సంచలన వ్యాఖ్యలు చేసింది.
Please Read Disclaimer