బిగ్ బాస్ హౌస్ నుంచి మొదట వచ్చేసేది ఎవరంటే?

0

తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షోకు సంబంధించి గత రెండు సీజన్లకు భిన్నంగా మూడో సీజన్ ప్రారంభం నుంచే వివాదాల్లో చిక్కుకుపోయిందీ షో. కమిట్ మెంట్.. ఎలా సంతృప్తి పరుస్తావని అడిగారంటూ ఇద్దరు బిగ్ బాస్ షో మీద ఆరోపణలు చేయటమే కాదు..పోలీసులకు కంప్లైంట్ కూడా చేశారు. ఇలా ఆరంభం నుంచే సంచలనాలతో షురూ అయిన బిగ్ బాస్.. తొలివారమే ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ను పెట్టేసి.. ప్రేక్షకుల్లో ఉత్కంట పెంచేశారు.

బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినంతనే ఆరుగురిని ఎలిమినేషన్ కు నామినేట్ చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ రోజు (ఆదివారం) ఎవరు ఎలిమినేట్ కానున్నారన్నది ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ షోకు సంబంధించి లీకులు ఈ మధ్యన ఎక్కువైన సంగతి తెలిసిందే. అలా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ షో నుంచి తొలి ఎలిమినేషన్ హేమే అవుతుందని చెబుతున్నారు.

కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాం మీద ఎలిమినేషన్ ఎదుర్కొంటున్న హౌస్ మేట్స్ కు ఎవరికెన్ని ఓట్లు వచ్చాయన్న ప్రచారం కూడా సాగుతోంది. అయితే.. ఇదంతా అనధికార ప్రచారం కావటంతో ఆ వివరాల్ని ఇవ్వట్లేదు. తాజాగా ఎలిమినేషన్ ఎదుర్కొంటున్న ఆరుగురు హౌస్ మేట్స్ లో టీవీ9 జాఫర్.. హేమ.. వితిక.. పునర్నవి భూపాలం.. హిమజా.. రాహుల్ సిప్లిగంజ్ ఉండగా.. ఎక్కువ ఓట్లు హిమజ.. పునర్నవికి వచ్చినట్లుగా తెలుస్తోంది. నిన్నటితో ముగిసిన ఓటింగ్స్ ప్రకారం చూస్తే.. అందరి కంటే తక్కువ ఓట్లు నటి హేమకు వచ్చినట్లుగా సమాచారం. దీంతో.. ఆమె ఎలిమినేషన్ ఖాయమని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ వారం ఎలిమినేషన్ నుంచి హిమజ.. పునర్నవి సేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.

హేమ ఎలిమినేట్ అవుతారన్న దానికి నిదర్శనంగా నాగ్ వ్యాఖ్యల్ని చెప్పక తప్పదు. ఇంట్లోకి వచ్చిన వెంటనే అందరి మీద డామినేషన్ చేశావు.. అందరూ కలిసి నామినేషన్ లో పెట్టేశారంటూ పంచ్ వేయటాన్ని మర్చిపోకూడదు. అయితే.. తాను వంట చేసి పెడతాను.. గొడవ ఎందుకనే ఉద్దేశ్యంలోనే అలా అన్నట్లుగా హేమ వివరణ ఇచ్చారు. ఏమైనా.. అందరూ ఇబ్బందిగా ఫీల్ అవుతున్న హేమ బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు రావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరి..అదెంతవరకూ నిజమన్నది తేలాలంటే.. ఈ రోజు రాత్రి బిగ్ బాస్ షో టెలికాస్ట్ అయ్యే వరకూ వెయిట్ చేయాల్సిందే.
Please Read Disclaimer