‘బిగ్ బాస్’ సీజన్ 3 -15 మంది కంటెస్టెంట్స్

0

‘బిగ్ బాస్’ సీజన్ 3 నిరీక్షణకు తెరపడింది. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి బుల్లితెరపై ‘బిగ్ బాస్’ సందడి మొదలైపోయింది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా మొదలైన ఈ షో 100 రోజులపాటు బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచనుంది. ఇప్పటికే టీవీ షో హోస్ట్‌గా అనుభవాన్ని సంపాదించిన నాగార్జున.. ఈ ‘బిగ్ బాస్’ను కూడా అదే స్టైల్‌లో హోస్ట్ చేస్తున్నారు. ‘కింగ్’లో పాటతో బిగ్ బాస్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. ఫస్ట్ సీజన్ హోస్ట్ ఎన్టీఆర్, సెకండ్ సీజన్ వ్యాఖ్యాత నానిని గుర్తుచేసుకున్నారు. ‘నా పెద్ద కొడుకు’ అని ఎన్టీఆర్‌ను.. ‘నా గోల్డ్’ అంటూ నానిని సంబోధించారు. ఆ తరవాత బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లి పరిశీలించారు.

హౌజ్‌లోకి నాగార్జునకు ఆహ్వానం పలికిన బిగ్ బాస్ ఆయనకు ఒక టాస్క్ ఇచ్చారు. 15 మంది కంటెస్టెంట్లలో మొదటి ముగ్గురినీ ఎంపిక చేయాలని నాగార్జునకు సూచించారు. బిగ్ బాస్ సూచన మేరకు మూడు చిట్టీలను తీసి ముగ్గురు కంటెస్టెంట్లను నాగార్జున ఎంపిక చేశారు. ఈ ముగ్గురిలో మొదటిగా యాంకర్ శివజ్యోతి అలియాస్ ‘తీన్మార్’ సావిత్రిని వేదికపైకి పిలిచారు. ఆ తరవాత టీవీ నటుడు రవికృష్ణను రెండో కంటెస్టెంట్‌గా.. సోషల్ మీడియా సెన్సేషన్, నటి అశురెడ్డిని మూడో కంటెస్టెంట్‌గా ఆహ్వానించారు. ఆ తరవాత జర్నలిస్టు జాఫర్‌ను పరిచయం చేశారు. ఐదో కంటెస్టెంట్‌గా నటి హిమజ బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టింది. 14, 15 కంటెస్టెంట్లుగా వచ్చిన హీరో వరుణ్ సందేశ్, ఆయన సతీమణి వితికా షెరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్

1. యాంకర్ శివజ్యోతి

యాంకర్ శివజ్యోతి

2. టీవీ నటుడు రవికృష్ణ

టీవీ నటుడు రవికృష్ణ

3. నటి అశురెడ్డి

నటి అశురెడ్డి

4.జర్నలిస్ట్ జాఫర్

జర్నలిస్ట్ జాఫర్

5. నటి హిమజ

నటి హిమజ

6. సింగర్ రాహుల్ సిప్లిగంజ్

సింగర్ రాహుల్ సిప్లిగంజ్

7. టీవీ నటి రోహిణి

టీవీ నటి రోహిణి

8. కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్

కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్

9. యువనటి పునర్నవి భూపాలం

10. నటి హేమ

నటి హేమ

11. టీవీ నటుడు అలీ రజా

టీవీ నటుడు అలీ రజా

12. హాస్యనటుడు మహేశ్ విట్ట

హాస్యనటుడు మహేశ్ విట్ట

13. యాంకర్, నటి శ్రీముఖి

యాంకర్, నటి శ్రీముఖి

14. వరుణ్ సందేశ్

వరుణ్ సందేశ్

15. వితికా షెరు (వరుణ్ సందేశ్ భార్య)

వితికా షెరు (వరుణ్ సందేశ్ భార్య)
Please Read Disclaimer