అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించిన హీరో అరెస్ట్

0

కన్నడ ఇండస్ట్రీలో నిర్మాతగా హీరోగా పలు సినిమాలు చేసిన హుచ్చ వెంకట్ కొన్ని రోజుల క్రితం ఎవరి మీదో కోపంతో రోడ్ పక్కన ఆపి ఉన్న కార్ అద్దాలు ద్వంసం చేసి వాళ్ళ చేతిలో చావు దెబ్బలు తిన్న సంగతి తెలిసిందే. అప్పుడే కన్నడ ఇండస్ట్రీ మొత్తం వెంకట్ చేసిన పనికి ఇండస్ట్రీ మొత్తం బ్యాడ్ నేమ్ వస్తుందని వాపోయారు. అయినా అతను తన బిహేవియర్ మార్చుకోలేదు. పదే పదే అలాంటి పనులే చేస్తూ అతని పరువు తీసుకోవడమే కాకుండా కన్నడ ఇండస్ట్రీ పరువు కూడా తీస్తున్నాడు.

శుక్రవారం మార్నింగ్ హిందూపూర్ – యలహంక దారిలోని మారసంద్ర టోల్ గేట్ వద్ద వీరంగం సృష్టించాడు. అక్కడే బస్సు కోసం వెయిట్ చేస్తున్న ఒక యువతి దగ్గరకు వెళ్లి ఆ అమ్మాయిని వేధించాడు. తనని ప్రేమించమని పెళ్లి చేసుకోవాలని వెంటపడ్డాడు. భయంతో ఆ అమ్మాయి అక్కడినుండి పారిపోయింది. ఆ కోపంతో తన కారు అద్దాలను అతనే పగలగొట్టి అక్కడ ఉన్న వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడుతూ రెచ్చిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకి వచ్చి అతడిని స్టేషన్ కి తీసుకెళ్లారు. వెంకట్ కి పిచ్చెక్కిందని అతనిని మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేయాలనీ కన్నడ ఇండస్ట్రీలో చాలామంది అంటున్నారు.
Please Read Disclaimer