హీరో డ్రెస్.. పాప జడుసుకుంది!

0

గ్లామర్ ఇండస్ట్రీలో ఉండేవారికి ఫ్యాషనబుల్ గా ఉండడం చాలా అవసరం. అందుకే స్టార్ హీరోలయినా.. హీరోయిన్లయినా తమ ఫ్యాషన్ పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తారు. ఫ్యాషన్ ఈవెంట్లు.. అవార్డు ఫంక్షన్లకు హాజరయితే డిజైనర్ దుస్తులు ధరించి మరీ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ కూడా ఫ్యాషన్ కు కేరాఫ్ అడ్రెస్ అన్నట్టుగానే ఉంటాడు. కానీ కొన్ని సమయాల్లో అది శృతి మించుతుంది.

ఒక్కోసారి గాడీగా ఉండే నియాన్ కలర్ డ్రెస్సుల్లో కనిపిస్తే మరోసారి ఎబ్బెట్టుగా ఉండే కలర్ కాంబినేషన్ ధరించి జనాలను తనవైపు తిప్పుకుంటాడు. మన పిచ్చి కానీ పిచ్చ డ్రెస్ కాంబినేషన్ వేస్తే ఎవరైనా వారిని వింతగా చూస్తారు కదా. ఒక్కోసారి రణవీర్ డ్రెస్సులపై సోషల్ మీడియాలో జోకులు పేలుతుంటాయి. రీసెంట్ గా దీపిక ఒక వెరైటీ డ్రెస్ లో కనిపిస్తే వెంటనే నెటిజన్లు ‘సావాసదోషం’ అంటూ దీపికను ఆడిపోసుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రీసెంట్ గా తన వింత డ్రెస్ తో ఒక చిన్న పాపను బెదరగొట్టాడు. ఈమధ్య రణవీర్ ముంబైలోని ఒక డబ్బింగ్ స్టూడియో నుంచి బయటకు వస్తుంటే అభిమానులు ఆయనను చూసేందుకు గుమికూడారు. వారిలో ఒక వ్యక్తి చిన్న పాపను ఎత్తుకొని ఉన్నాడు. రణవీర్ సదరు అభిమాని దగ్గరకు వెళ్లి ఆ పాపను ముద్దు చేయబోయాడు. మన సింగుగారి డ్రెస్ ను చూసే బెదిరిపోయిన ఆ పాప ఏడుపు లంకించుకుంది.

ఇంతకీ రణవీర్ డ్రెస్ ఎలా ఉంది అంటే.. హుడ్ ఉన్న లాంగ్ రెడ్ కలర్ షర్టు.. కళ్ళకు నలుపు రంగు కూలింగ్ గ్లాసెస్ ధరించాడు. బ్లాక్ జీన్స్…వైట్ కలర్ స్పోర్ట్స్ షూ ధరించి ఎంత వింతగా ఉండాలో అంత వింతగా ఉన్నాడు. సింగుగారి దెబ్బకు పాప ఏడ్చిన ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది. అయినా జగన్మోహినికి జబర్దస్త్ కజిన్ లా డ్రెస్సులు వేసుకుంటే పిల్లలు భయపడకుండా ఎలా ఉంటారు? ఇలాంటి పిచ్చ డ్రెస్సులు వేసుకొని తిరుగుతూ ఉంటే సింగు గారి శ్రీమతి దీపిక ఏం చేస్తోంది? ఆమె అయినా భర్తకు చెప్పొద్దూ..?
Please Read Disclaimer