స్టార్లందరి మెడలు వంచేలా మెగాస్టార్ క్లాస్!

0

మెగాస్టార్ చిరంజీవి రెండేళ్ల క్రితం `ఖైదీ నం.150`తో రీఎంట్రీ ఇచ్చారు. పునరారంగేట్రం అదరగొట్టారు. రీఎంట్రీ మూవీ దాదాపు రూ.150కోట్లు వసూలు చేసింది. అయితే పదేళ్ల గ్యాప్ తర్వాత ఆయన కంబ్యాక్ ఒక వండర్. ఇక ఆయన వస్తూనే తిరిగి పరిశ్రమ ట్రెండ్ ని గమనించారట. చిత్ర పరిశ్రమలో ఎన్నో మార్పులు గమనించి షాకయ్యారట. అందులో చాలా వరకు పరిశ్రమ పురోగతి వైపు వెళ్ళే అంశాలుండగా.. మరికొన్ని నెగటివ్ అంశాలు కూడా ఉన్నాయని కొందరికి క్లాస్ తీస్కున్నారు. చాలా క్రింది స్థాయి నుంచి మెగాస్టార్ గా ఎదిగిన ఆయన ఆ రోజుల్లో నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల కాలంలో హీరోల్లో వచ్చిన మార్పులు.. కొన్ని కొత్త పరిణామాలు మెగాస్టార్కి అంసతృప్తికి గురి చేశాయి. దీంతో ఇటీవల ఓ ఈవెంట్లో ఆయన ఒకరకంగా క్లాస్ తీస్కోవడం నవతరం నటీనటుల్లో చర్చకొచ్చింది.

ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోల నుంచి యంగ్స్టర్స్.. స్టార్ హీరోలు.. హీరోయిన్లపై మెగాస్టార్ మెగా పంచ్ లు తాజాగా చర్చకొచ్చాయి. హీరోహీరోయిన్లు షాట్ అయిపోగానే క్యారవాన్ లోకి వెళ్ళిపోతున్నారని.. స్టార్స్ ని షాట్ కి పిలిచే క్రమంలో ఓ అసిస్టెంట్ డైరెక్టర్ జీవితం క్యారవాన్ కే పరిమితమవుతోందని .. అతను వర్క్ నేర్చుకునే పరిస్థితి ఉండటం లేదని పలు నిగూఢంగా దాగిన వాస్తవాలను బయటకు వెల్లడించారు. హీరోహీరోయిన్ షాట్ అయిపోయాక కూడా సెట్ లోనే ఉంటే వర్క్ వేగంగా జరుగుతుందని దీంతో నిర్మాతకు కాస్ట్ బర్డెన్ పెరగకుండా ఉంటుందని లైట్ గా తనదైన శైలిలో క్లాస్ తీస్కున్నారు. కారవ్యాన్ కి వెళ్లకపోతే.. షూటింగ్ త్వరగా అయ్యేందుకు అవకాశం ఉంటుందని.. నెంబర్ ఆఫ్ డేస్ షూటింగ్ తగ్గుతుందని సూచించారు.

లెజెండ్ చిరంజీవి స్థాయి వ్యక్తి ఈ కామెంట్స్ చేయడంతో ఇప్పుడు స్టార్ హీరో.. హీరోయిన్లకి ఏమాత్రం మింగుడు పడటం లేదు. ఓ రకంగా స్టార్లంతా కన్ ఫ్యూజన్ లో పడిపోయారు. ఒకింత అసహనానికి.. మరికొంత ఆందోళనకి గురవుతున్నట్టు తెలుస్తుంది. అయితే చిరు చేసిన ఈ సంచలన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఈ పరిస్థితిని స్వయంగా ఎదుర్కొన్న నిర్మాతలు చిరుకి మద్దతు పలుకుతున్నారు. వెటరన్ నిర్మాత అంబికా కృష్ణ స్వయంగా చిరు కామెంట్స్ ని సమర్థిస్తూ స్టేట్ మెంట్ ఇచ్చారు.దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి చైర్మెన్ కాట్రగడ్డ ప్రసాద్ సైతం నేటితరం చిరంజీవి ఆలోచనలను అనుసరించాలని వెల్లడించారు. మరికొంత మంది నిర్మాతలు ఇలానే ముందుకొచ్చి తమ వాయిస్ ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇకనైనా క్యారవాన్ సంస్కృతిలో మార్పు వస్తుందేమో చూడాలి.

గతేడాది `సైరా నరసింహారెడ్డి` లాంటి పాన్ ఇండియా చిత్రం కోసం చిరు రోజూ 18 గంటలు శ్రమించారని చరణ్ చెప్పారు. అందుకే ఆయన అందరికీ చెప్పేందుకు అర్హుడు. ఇక చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి చిరు చెప్పిన రూల్ అప్లయ్ అవుతుందన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రామ్చరణ్ – నిరంజన్ రెడ్డి సంయుక్తం గా నిర్మిస్తున్నారు. త్రిష కథానాయిక గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ దసరా లేదా దీపావళికి విడుదల కానుంది. ఇదిలా ఉంటే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రానికి ఆచార్య అనే పేరును చిరు ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-