భార్య ఇల్లున్నా పక్కనే అద్దె కు ఉంటున్న హీరో

0

బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ వీర్ సింగ్ మరియు దీపిక పదుకునేలా గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతూనే ఉంటుంది. వీరిద్దరి మద్య రొమాంటిక్ విషయాలతో పాటు వీరిద్దరికి సంబంధించిన సినిమాల వార్తలు మీడియాలో వస్తూనే ఉంటాయి. అయితే ఈసారి ఒక విచిత్రమైన వార్త ఒకటి సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతోంది. అదేంటి అంటే రణ్ వీర్ సింగ్ ఒక అపార్ట్ మెంట్ లో ఒక ప్లాట్ ను దాదాపు 7 లక్షల రూపాయలు అద్దె చెల్లించి తీసుకున్నాడట. దాన్ని ఆఫీస్ గా వినియోగించుకుంటూ ఉన్నాడు.

ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. అసలు విషయం ఏంటీ అంటూ రణ్ వీర్ సింగ్ 7 లక్షలు అద్దె చెల్లిస్తున్న ప్లాట్ ఉన్న అపార్ట్ మెంట్ లోనే అది కూడా పక్కనే దీపిక పదుకునేకు ఒక ప్లాట్ ఉంది. ఆ ప్లాట్ ఖాళీగానే ఉంది. అప్పుడప్పుడు ఏదైనా మీటింగ్స్ కు ఆమె రెంట్ కు ఇస్తూ ఉంటుందట. దాదాపు పాతిక కోట్ల విలువ చేసే ఆ ప్లాట్ ను రణ్ వీర్ సింగ్ వినియోగించుకోకుండా సొంతంగా నెలకు 7 లక్షల రెంట్ చెల్లిస్తూ మరో ఫ్లాట్ లో ఉండటం ఏంటో అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

ఈ ఫ్లాట్ మాత్రమే కాకుండా దీపిక పదుకునే కు చెందిన ఆస్తులు మరియు ఏ ఇతర వస్తువులు కూడా రణ్ వీర్ సింగ్ వినియోగించుకోడని.. ఆమె సంపాదించింది పూర్తిగా ఆమె ఖాతాలోనే అంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సాదారణంగా భార్య భర్తలు అయితే ఒకరి ఆస్తులు ఒకరికి అవుతాయి. కాని ఈ జంట మాత్రం పెళ్లి చేసుకున్న తర్వాత వేరు వేరుగానే అన్నట్లుగా ఉంటున్నారు. రణ్ వీర్ సింగ్ మరియు దీపికలు మాత్రమే కాకుండా సెలబ్రెటీ కపుల్స్ ఎక్కువ గా ఇలాగే ఉంటారట. ఒకరి సంపాదన తో ఒకరికి సంబంధం లేనట్లుగానే ఉంటారట.
Please Read Disclaimer