ఇండియా ఓడిపోతుందని ముందే తెలుసుకున్న హీరో

0

నిన్న ఇండియా ఓడిపోవడం అభిమానులను శోకసంద్రంలో ముంచింది. ఈజీగా గెలుస్తాం కాబట్టి న్యూజిలాండ్ సెమిస్ కు రావాలన్న ఫాన్స్ కోరిక నెరవేరింది కానీ విజయం మాత్రం దక్కలేదు. ఒకవేళ ప్రత్యర్థి మారిఉంటే ఏం జరిగేదో కానీ మొత్తానికి భారత్ వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించడం ఊహించని షాక్. కానీ జ్యోతిష్యాలకు నమ్మకాలకు నెలవైన మన గడ్డ మీద ఇండియా పరాజయాన్ని ముందే ఎవరైనా ఊహించారా అంటే ఔనంటున్నాడు తమిళ హీరో మాధవన్.

ఇవాళ ఓ షాకింగ్ ఫేస్ బుక్ పోస్ట్ చేసిన ఈ సవ్యసాచి విలన్ అందులో వీడియో కూడా పొందుపరిచాడు. ప్రపంచ కప్ మొదలుకావడానికి కొన్ని వారాల ముందు జరిగిన ఓ టీవీ షోలో పాల్గొన్న ఓ జ్యోతిష్యుడు టోర్నమెంట్ లో సెమిస్ లో నాలుగు అగ్ర జట్లు వెళ్తాయని పేర్లతో సహా చెబుతూ ఇండియా మాత్రం ఫైనల్ కు వెళ్ళదని చెప్పాడు. అంతే కాదు న్యూజిలాండ్ టైటిల్ విన్నర్ గా నిలవడంతో పాటు ఆ టీమ్ కెప్టెన్ విలియంసన్ ప్లేయర్ అఫ్ ది టోర్నమెంట్ అందుకుంటాడని జోస్యం చెప్పాడు.

ఇతను చెప్పిన మూడు విషయాల్లో రెండు నిజమయ్యాయి. ఒకటి అతను చెప్పిన నాలుగు టీమ్ లే సెమీస్ కు చేరడం. రెండు న్యూజిలాండ్ ఫైనల్ కు రావడం. ఇప్పుడు బాలన్స్ ఉన్న మూడోది అది టైటిల్ గెలిచి విలియం సన్ కు అవార్డు దక్కడం. మాధవన్ దీని గురించి ప్రస్తావిస్తూ ఇంత ఖచ్చితంగా భవిష్యత్తు చెప్పిన వారిని తాను చూడలేదని అందుకే మౌనంగా ఉన్నానని ట్వీట్ చేసాడు. నిజమే మరి ఎవరికైనా ఇలాంటిది చూశాక మాటలు వస్తాయా.
Please Read Disclaimer