నేనెక్కడికి పోతాను.. మళ్లీ మీ వద్దకే వస్తాను

0

మంచు మనోజ్ గత సంవత్సర కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. సామాజిక కార్యక్రమాలతో బిజీగా కాలం గడుపుతున్న మంచు మనోజ్ కు ఎక్కడికి వెళ్లిన సినిమా ఎప్పుడు ప్రారంభం అంటూ ప్రశ్నిస్తున్నారట. తాజాగా తన తండ్రి పుట్టిన రోజు సందర్బంగా ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చాడు. మోహన్ బాబు పుట్టిన రోజు వేడుక తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్లో జరిగింది. ఈ వేడుకలో పెద్ద ఎత్తున అభిమానులు మరియు సినీ రాజకీయ ప్రముఖులు హాజరు అయ్యారు. ఈ సందర్బంగా మంచు మనోజ్ మాట్లాడుతూ తన సినీ కెరీర్ పై క్లారిటీ ఇచ్చాడు.

మనోజ్ మాట్లాడుతూ… హ్యాపీ బర్త్ డే నాన్న ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మీ రుణం తీర్చుకోలేను. మీ కొడుకుగా పుట్టడం అదృష్టంగా భావిస్తాను. ఈమద్య కాలంలో అంతా కూడా నీ సినిమా ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు. నాన్న పుట్టిన రోజు సందర్బంగా చెబుతున్నాను నా సినిమాను జూన్ నెలలో ప్రారంభించబోతున్నాను. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. మీరు ఇచ్చిన కూడు తింటున్నాను మీవద్దకే మళ్ళీ వస్తాను నేనెక్కడికో ఎందుకు వెళ్తాను. త్వరలోనే మీకు ఒక గుడ్ న్యూస్ వినిపిస్తాను ఇదే ఏడాది సినిమా వచ్చేలా చూస్తాను అంటూ మంచు మనోజ్ హామీ ఇచ్చాడు. మనోజ్ సినిమాలకు గుడ్ బై చెప్పాడు అంటూ వస్తున్న వార్తలపై ఆయన ప్రకటన క్లారిటీ ఇచ్చినట్లయ్యింది.

తండ్రి పుట్టిన రోజు సందర్బంగా ఒక పాపను దత్తత తీసుకుని చదివించేందుకు సిద్దం అయ్యి రియల్ హీరో అనిపించుకున్న మంచు మనోజ్ ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడని మంచు అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Please Read Disclaimer