60వ బర్త్ డే.. ఆర్జీవీలా హర్టవుతాడా?

0

ప్రతి పుట్టినరోజు నాలో విచారం పెంచుతుంది. ఒక సంవత్సరం ఓల్డ్ అయిపోయానన్న బాధను తట్టుకోలేను! అంటూ `వయసు`ను గుర్తు చేసుకుని కలతకు గురయ్యారు మొన్న బర్త్ డే రోజున ఆర్జీవీ. ఈ బాధలోనే ఆయన `కోబ్రా` అనే సినిమాలోనూ నటించేస్తున్నారు. మళ్లీ అవకాశం ఉంటుందో లేదో!! అది సరే.. మన పరిశ్రమలో అగ్ర హీరోలు కూడా ఆర్జీవీలానే ఫీలవుతారా వయసు విషయంలో? ఒక్కో సంవత్సరం కరిగిపోతుంటే హర్టవుతుంటారా? అంటే ఏమో కానీ.. టాలీవుడ్ నవమన్మధుడు .. అగ్ర కథానాయకుడు కింగ్ నాగార్జున వయసు మాత్రం 60కి చేరువ అవ్వడం ఫిలింవర్గాల్లో చర్చకు వచ్చింది. వయసు 60 మార్క్ అనేది వినడానికే కాస్త ఇబ్బందికరమే. కానీ కాలాన్ని ఆపలేం కదా? అయితే 60లోనూ 30 ఏజ్ కుర్రాడిలా కింగ్ మెయింటెయిన్ చేస్తున్న తీరుకు మగువల్లో నిరంతరం వేడెక్కించే చర్చ సాగుతూనే ఉంది. సాటి హీరోలంతా ఏజ్ పరంగా బయటపడిపోతుంటే నాగార్జున మాత్రం దానిని తెలియనీకుండా మేనేజ్ చేసేస్తున్నారు. అందుకోసం నిరంతరం జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ.. పెర్ఫెక్ట్ డైట్ మెయింటెయిన్ చేస్తూ ఆయన పడే శ్రమ అంతా ఇంతా కాదని సన్నిహితులు చెబుతుంటారు. అందుకే ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీపడుతూ నాగ్ వరుసగా సినిమల్లో నటించేస్తున్నారు.

29 ఆగస్ట్ కింగ్ బర్త్ డే. ఇది తనకు 60వ బర్త్ డే కావడం ఓ స్పెషల్. అంటే సష్టి పూర్తికి సమయమాసన్నమైందన్నమాట. మనిషి ఆయుర్ధాయం వందేళ్లు పైగానే. ఆరోగ్యం ఉన్న వాళ్లు 120 సంవత్సరాలు జీవించవచ్చని శాస్త్రం చెబుతోంది. అందులో సగం ఏజ్ 60 కాబట్టి సష్టి పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఇంకో హాఫ్ లైఫ్ ఉందన్నమాట. నాగార్జున ప్రస్తుత స్పీడ్ చూస్తుంటే అలుపన్నదే లేకుండా లైఫ్ టైమ్ హీరోగానే రన్ చేస్తారనే అభిమానులు భావిస్తున్నారు. హీరోగా.. నిర్మాతగా.. స్టూడియోల ఓనర్ గా.. బిజినెస్ మేన్ గా అలుపెరగని పయనం చేశారు నాగార్జున. ఏఎన్నార్ లెగసీని దశాబ్ధాల పాటు విజయవంతంగా ముందుకు నడిపించారు.

అయితే తన ఫ్రెండు ఆర్జీవీ ఒక సంవత్సరం ఓల్డ్ అయిపోయానని వాపోయారు.. మరి నాగ్ ఏమని ఫీలవుతారు?? మరో 120రోజుల్లో 60 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. అయినా ఇప్పటికీ ఫిట్ బాడీని గొప్పగా మెయింటెయిన్ చేస్తారు. ఆయన గుడ్ రోల్ మోడల్ అనడంలో సందేహం లేదు. అక్కినేనీస్ లో నాగచైతన్య అఖిల్ అందరికీ ఫిట్ నెస్ పరంగా స్ఫూర్తి కింగ్ నే. తన అడుగు జాడల్లోనే ఆ ఇద్దరూ ఫిట్ నెస్ విషయంలో జాగ్రత్త పడుతున్నారు. కోడలు సమంత సైతం పిట్ నెస్ ఫ్రీక్ గా కనిపిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంతకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఫిట్ నెస్ విషయంలో నాగార్జున.. చైతూల్లో ఎవరు ది బెస్ట్? అని ప్రశ్నిస్తే ఎలాంటి తడబాటు లేకుండా మామ నాగార్జుననే ఫస్ట్ అంటూ పొగిడేసింది సామ్. ఆ తర్వాతనే చైతూ అని తెలిపింది. తాను బిరియానీలు లాగించేస్తానని అయితే చైతన్య మాత్రం తిండి పరంగా కంట్రోల్డ్ గా ఉంటాడని తెలిపారు సామ్. మామ వయసు 60 కి చేరువైనా ఇంకా పెర్ఫెక్ట్ ఫిట్!! అంటూ యాథృచ్ఛికంగా వయసును గుర్తు చేశారు.
Please Read Disclaimer