ఆ హీరోకు హిట్లకంటే వివాదాలే ముఖ్యమా..?

0

హీరో నాగశౌర్యకు వివాదాలలో నిలవడం ఈ మధ్య మాములే అయిపోయింది అంటున్నారు టాలీవుడ్ సినీ విశ్లేషకులు. ఎందుకంటే ఆయనతో సినిమా చేసిన ప్రతీ ఒక్కరి పై మీడియా పరంగా కామెంట్స్ చేసి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. గతంలో తనకు ఛలో సినిమాతో లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ వెంకీ కుడుముల పై కూడా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే..

తాజాగా వెంకీ కుడుముల నితిన్ హీరోగా రూపొందించిన ‘భీష్మా’ సినిమాతో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా విజయంలో భాగంగా ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా అవకాశం గురించి హీరో నాగశౌర్య గురించి చెప్పుకొచ్చాడు. నాగశౌర్య వెంకీ పట్ల ఎన్ని కామెంట్స్ చేసాడో తెలిసి కూడా వాటన్నింటిని పక్కన పెట్టి శౌర్య గురించి పాజిటివ్ గా చెప్పడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా నిలుస్తున్నాడు. నాగశౌర్య ఎంత మందిని కామెంట్స్ చేసినా వారంతా ఆయన గురించి పాజిటివ్ గా చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.

ఇతరుల అటిట్యూట్ పట్ల అంత శ్రద్ధ తీసుకోవడం మానేసి కెరీర్ పై దృష్టి పెడితే బాగుంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఛలో సినిమా తర్వాత ఇంతవరకు హిట్ కొట్టలేకపోయాడు. కథల ఎంపిక పై జాగ్రత్త పడటం ఆపేసి ఇతరులను కామెంట్స్ చేస్తూ కూర్చుంటే ఇక నీ కెరీర్ ముగిసినట్లే అంటూ సోషల్ మీడియాలో అభిమానుల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి యంగ్ హీరో ఇక పై కెరీర్ పై దృష్టి పెడతాడా.. లేక వివాదాలలో తల దూర్చుతాడా.. తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే..
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-