నానీ ఛాన్సిచ్చిన ఆ లక్కీ గయ్ ఎవరు?

0

కొత్తతరం దర్శకులకు అవకాశాలిచ్చి ప్రోత్సహించడంలో నేచురల్ స్టార్ నాని తర్వాతనే. స్క్రిప్టు నచ్చితే చాలు సెట్స్ కెళ్లిపోవడమే. ఇంతకుముందు తాను స్వయంగా నిర్మాణ భాగస్వామిగా మారి రాజ్ అండ్ డీకే లాంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్లతో కలిసి సందీప్ కిషన్ సినిమాకి పని చేశాడు. ఆ తర్వాత సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి అందులో ప్రశాంత్ వర్మకు `అ!` అనే ప్రయోగాత్మక చిత్రం చేసేందుకు అవకాశం కల్పించాడు.

అ! చిత్రం కేవలం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోవడమే కాదు.. జాతీయ అవార్డు సైతం కొల్లగొట్టింది. అందుకే నానీ లాంటి స్టార్ ని నమ్మి ఒక కథను వినిపిస్తే దానికి వెంటనే పట్టాలెక్కే ఛాన్సుంటుందని నమ్ముతూ కొత్తతరం దర్శకరచయితలు తనని కలుస్తున్నారట. అందులో ఓ లక్కీ గయ్ పేరు ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ లో ప్రముఖంగా వినిపిస్తోంది.

ఎవరా డెబ్యూ దర్శకుడు? అంటే.. ఆయన పేరు మహేష్. నేచురల్ స్టార్ కి స్టోరి లైన్ వినిపించి ఓకే చేయించుకున్నాడట. దర్శకుడిగా మహేష్ కి ఇదే తొలి చిత్రం. ఏ తరహా కథను ఎంచుకున్నాడు అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని నాని స్వయంగా నిర్మిస్తారా? లేక వేరే నిర్మాతతో కలిసి చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం `వీ` చిత్రీకరణలో బిజీగా ఉన్న అతడు తొందర్లోనే ఈ కొత్త మూవీకి సంబంధించిన ప్రకటన చేయనున్నారట. గ్యాంగ్ లీడర్ ఫ్లాపైనా నానీ స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. ఓవైపు కొత్తతరం దర్శకులకు అవకాశాలిస్తూనే సీనియర్లతో ప్రయోగాలు చేస్తున్నాడు. ఇంద్రగంటితో వీ పెద్ద సక్సెసవుతుందని నమ్ముతున్నాడు. అదే జరిగితే.. ఇక ఈ స్పీడ్ ఇప్పట్లో తగ్గడం కష్టమే.
Please Read Disclaimer