హీరోల స్నేహం గుట్టు విప్పిన నిఖిల్

0

హీరోల మధ్య స్నేహం గురించి నిరంతరం అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతుంటుంది. ఇటీవల మన హీరోలంతా ఎంతో ఫ్రెండ్లీగా ఉంటూ ఒకరి సినిమాలకు ఒకరు ప్రచారం చేస్తున్నారు. ఒకరి ఈవెంట్లకు ఒకరు అటెండవుతున్నారు. మహేష్-చరణ్-ఎన్టీఆర్-ప్రభాస్-అల్లు అర్జున్ .. వీళ్లంతా ఒక బ్యాచ్ లాగా కలిసిపోయారు. ఎవరి ఇళ్లలో ఏ వేడుకలు ఉన్నా కుటుంబ సమేతంగా ఎటెండవుతున్నారు. ఇది పరిశ్రమలో సామరస్యాన్ని పెంచుతోందన్న మంచి మాటా వినిపిస్తోంది.

అయితే నేటితరం హీరోల్లో ఈ స్నేహం పాళ్లు ఏ లెవల్లో ఉంది? అంటే నిన్నటి సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన `నిను వీడని నీడను నేను` ఈవెంట్ ని చూడాల్సిందే. ఈ వేదికపై యువహీరోలు సందీప్ కిషన్- నిఖిల్ – సుధీర్ బాబు- కార్తికేయ – విశ్వక్ సేన్ ఒకే వరుసలో నిలబడి ఎంతో సందడి చేశారు. అంతేకాదు సందీప్ సినిమా పెద్ద హిట్టవ్వాలని ఇతర హీరోలు ఎంతో స్నేహంగా బ్లెస్ చేశారు. ఈ వేదిక పై ఎనర్జిటిక్ హీరో నిఖిల్ చెప్పిన ఓ మాట ఎంతగానో ఇంప్రెస్ చేసింది. “సినిమా యాక్టర్ల మధ్య కాంపిటీషన్ ఉంటుందని.. ఒకరి సినిమా గురించి ఇంకొకరు మాట్లాడుకుంటారనేవి మధ్యలో వాళ్లు చెప్పే విషయాలని సందీప్ కిషన్ ని కలిసిన తరవాత అర్థమైంది. మేం ఎప్పుడూ మాట్లాడుకునేవాళ్లం కాదు. ఒక్కసారి మాట్లాడటం మొదలుపెట్టిన తరవాత మాటలు ఆగలేదు“ అని నిఖిల్ అన్నారు. ప్రీరిలీజ్ కి వస్తున్నా అని నేనే సందీప్ కి కాల్ చేసి వెళ్లానని నిఖిల్ వెల్లడించారు. అంతేనా `నిను వీడని నీడను నేను` సినిమా కోసం నిర్మాతగానూ జాయిన్ అవుతానని సందీప్ ని అడిగానని నిఖిల్ తెలిపారు. సినిమా బాగా వస్తోందని విని డబ్బు పెడతానన్నా. జీవితంలో మనం కింద పడతాం. పైకి లేస్తాం. ఎప్పుడూ నిరాశ పడకూడదు. ఈ సినిమా తరవాత సందీప్ కిషన్ పైన ఉంటాడు. తను పైకి లేచే టైమ్ మొదలైంది. ఎవరూ ఆపలేరు“ అని నిఖిల్ వ్యాఖ్యానించాడు.

ఇక ఈ వేదిక పై సందీప్ కిషన్ ఎంతో ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. “మన పని మనం చేసుకుంటూ వెళతాం. కానీ ఒకడు ఒక సినిమా తీస్తున్నాడంటే… సంబంధమే లేకుండా ఆ సినిమాను ఆపడానికి కొందరు బయలుదేరతారు“ అని వ్యాఖ్యానించారు. అన్నిటి కన్నా సినిమా గొప్పది. ఆ సినిమాను ఆ సినిమా కాపాడుకుంటూ వస్తుందని కాస్తంత వేదాంత ధోరణితోనే సందీప్ మాట్లాడడం ఆసక్తిని రేకెత్తించింది. నిను వీడని నీడను నేను ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer