ఎక్స్ క్లూజివ్: నిఖిల్ – జీఏ 2 టైటిల్ ఇదే

0

యంగ్ హీరో నిఖిల్ అర్జున్ సురవరం తర్వాత వరుసగా రెండు సినిమాలతో బిజీ అయిన సంగతి తెలిసిందే. అందులో కార్తికేయ సీక్వెల్ తో పాటు గీతా ఆర్ట్స్ 2 (జీఏ2) బ్యానర్ లోనూ ఓ సినిమాని ప్రకటించాడు. ప్రస్తుతం ఈ సినిమాలకు సంబంధించిన ప్రతి అప్ డేట్ నిఖిల్ ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం.. నిఖిల్ హీరోగా జీఏ2.. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి అదిరిపోయే టైటిల్ ని ఫైనల్ చేశారని `తుపాకి` కి ఎక్స్ క్లూజివ్ గా తెలిసింది. ఇంతకీ ఏమిటా టైటిల్ అంటే.. `18 పేజెస్` అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట. 18 పేజెస్ .. 18 పేజీలు ఎలా పిలిచినా ఆ పద్దెనిమిది పేజీల్లో ఏం ఉందోనన్న క్యూరియాసిటీ అయితే పెంచగలిగారు. చక్కని అనుభూతులు మధురం అనిపించే లవ్ రొమాన్స్ కి సంబంధించిన సన్నివేశాలతో అద్భుతమైన ప్రేమకథని తెరకెక్కిస్తున్నారని ఈ టైటిల్ వెల్లడిస్తోంది.

టైటిల్ క్యాచీగా ఉంది. పైగా లోతైన భావనల్ని ప్రేక్షకుల్లోకి పంపించేంత స్ట్రెంగ్త్ కూడా కనిపిస్తోంది. సుకుమార్ అందించిన కథతో కుమారి 21ఎఫ్ ఫేమ్ సూర్య ప్రతాప్ తెరకెక్కించనున్న ఈ మూవీలో నిఖిల్ పాత్ర ఆసక్తికరంగా ఉంటుందట. ఈ మేరకు సోషల్ మీడియాలో . మరో కొత్త కాన్సెప్ట్ .. ఆసక్తికర ప్రేమకథ అంటూ. ఊరించారు. ముహుర్తం షాట్ మార్చి 5 ఉదయం 9 గంటలకు అని.. అలాగే అదే సమయానికి టైటిల్ కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇక అర్జున్ సురవరం లాంటి ప్రయోగాత్మక చిత్రం తర్వాత నిఖిల్ తన కెరీర్ ని మరో లెవల్ కి తీసుకెళ్లే పకడ్భందీ వ్యూహం తో ఉన్నాడు. బ్లాక్ బస్టర్ కార్తికేయ సీక్వెల్ ని పెద్ద హిట్ చేయాలన్న పంతం కనిపిస్తోంది.
Please Read Disclaimer