దసరా సీజన్: సైరాతో సైసై అంటున్న భీష్మ?

0

టాలీవుడ్ హీరో నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కు ‘ఫరెవర్ సింగిల్’ అనేది టాగ్ లైన్. ఈ చిత్రంలో నితిన్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ సినిమాను దసరా సీజన్లో రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

అయితే ఇక్కడ ఓ చిక్కుంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ పీరియడ్ చిత్రం ‘సైరా’ను కూడా దసరా సీజన్లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ చిత్రం కాబట్టి ఈ సీజన్ ను మిస్ అయ్యే అవకాశం ఎంతమాత్రం లేదు. ఒకవేళ నితిన్ సినిమా రిలీజ్ కూడా దసరాకే ఫిక్స్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా మెగాస్టార్ సినిమాతో పోటీ పడవలసి ఉంటుంది. ఎంత కామెడి ఎంటర్టైనర్ అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర బాస్ సినిమాతో పోటీ పడడం కష్టమైన విషయమే.

మరి ‘భీష్మ’ నిర్మాతలైన సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ పోటీకి నిజంగానే రెడీ అవుతారా లేదా అనేది వేచి చూడాలి. అధికారికంగా రెండు సినిమాల విడుదల తేదీలు ప్రకటిస్తే కానీ ఈబాక్స్ ఆఫీస్ పోటీ పై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు నితిన్ ఒక డై హార్డ్ ఫ్యాన్ అనే సంగతి తెలిసిందే. అలాంటప్పుడు మెగాస్టార్ సినిమాకు పోటీగా నితిన్ తన సినిమాను రిలీజ్ చేయడం జరగదని మాత్రం ఒక వెర్షన్ వినిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో..!
Please Read Disclaimer