నేను అనుష్కను ప్రేమిస్తే దాచేవాడినే కాదు

0

‘మిర్చి’ సినిమా చేసినప్పటి నుండి కూడా ప్రభాస్.. అనుష్కల మద్య లవ్ అఫైర్ గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాహుబలి చిత్రం సమయంలో ఆ వార్తలు పీక్స్ కు చేరాయి. బాహుబలి చిత్రం కోసం ప్రభాస్ మరియు అనుష్కలు చాలా కాలం కలిసి వర్క్ చేశారు. దాంతో ఆ వార్తలను ఆపలేని స్థితికి చేరాయి. బాహుబలి ప్రమోషన్ సమయంలో ప్రభాస్ మరియు అనుష్కలు తమ ప్రేమ వార్తలను కొట్టి పారేశారు. తాము మంచి స్నేహితులం అంటూ చెప్పారు. కాని సోషల్ మీడియాలో వారికి సంబంధించిన ఫొటోలు ప్రేమ పక్షులంటూ తెగ వైరల్ అయ్యాయి.

బాహుబలి రెండు పార్ట్ లు పూర్తి అయిన తర్వాత పెళ్లి చేసుకుంటారని కూడా ప్రచారం జరిగింది. బాహుబలి విడుదలై ఏళ్లు గడిచింది. సాహో సినిమాతో ప్రభాస్ సిద్దం అయ్యాడు. సాహో సమయంలో కూడా అనుష్కతో ప్రేమాయణం గురించి మీడియాలో వార్తలు వచ్చాయి. ఇద్దరు కూడా ఒకరికి ఒకరు బర్త్ డే గిఫ్ట్ లు ఇచ్చుకోవడం ఇతరత్ర కారణాలు చూపుతూ ప్రేమలో ఉన్నట్లుగా చాలా మంది నమ్మకంగా చెబుతున్నారు. కాని ప్రభాస్ మాత్రం మళ్లీ పుకార్లకు చెక్ పెట్టాడు.

తాజాగా సాహో చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ పదే పదే అనుష్క కేవలం స్నేహితురాలని చెప్పినా కూడా మీడియాలో వార్తలు రావడంపై అసహనం వ్యక్తం చేశాడు. నిజంగా నేను అనుష్కను ప్రేమించి ఉంటే ఇంత కాలం ఆ విషయాన్ని దాచాల్సిన అవసరం లేదు. ఇంత కాలంగా అందరి కళ్లు కప్పి తిరగగలమా. ఏదో ఒక సమయంలో ఇద్దరం దొరికి పోయేవాళ్లం. అలాంటిది ఏమీ లేదు కనుక ఇప్పటి వరకు తామిద్దరం పదే పదే స్నేహితులమని చెబుతున్నాం. ప్రేమించిన విషయాన్ని దాచుకోవాల్సిన అవసరం ఏముంది.

ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది. నా వ్యక్తిగత విషయాలను ఎప్పుడు కూడా దాచి పెట్టకుండా అభిమానుల ముందు ఉంచానని ప్రభాస్ అన్నాడు. ప్రభాస్ ఈ మాటలతో అనుష్కతో తనది కేవలం స్నేహమే అని మరోసారి క్లారిటీ ఇచ్చాడు. మరి ఇప్పటికైనా ప్రభాస్.. అనుష్కల ప్రేమ వార్తలకు ఫుల్ స్టాప్ పడుతాయో చూడాలి.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home