రాజ్ తరుణ్ అరెస్టు… కానీ!

0

నార్సింగి కారు ప్రమాదం కేసులో పోలీసులు ఎట్టకేలకు నటుడు రాజ్ తరుణ్ ను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన స్టేట్ మెంట్ ను రికార్డు చేసుకున్న పోలీసులు అనంతరం వెంటనే బెయిలుపై విడుదల చేశారు. సీఆర్ పీసీ సెక్షన్ 41 కింద ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో సోమవారం రాజ్ తరుణ్ కోర్టుకు హాజరు కానున్నారు. ఈ వీడియోను తీసి పోలీసులకు అందజేయకుండా రాజ్ తరుణ్ ను బ్లాక్ మెయిల్ చేసిన కార్తిక్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో అతడిని పిలిచి విచారణ చేయనున్నారు.

వేగంగా వెళ్తుండగా… కారు కంట్రోల్ కాలేదని – అందుకే ప్రమాదం జరిగిందని ఆయన పోలీసులకు వివరించారు. రాజ్ తరుణ్ తో వివరాలు సేకరించిన అనంతరం వ్యక్తిగత పూచీకత్తు కింద పోలీసులు బెయిలు మంజూరు చేశారు. సోమవారం దీనిపై కోర్టులో విచారణ జరగనుంది. అయితే… ఈ ప్రమాదాన్ని క్యాష్ చేసుకుందామని ప్రయత్నించాడని ఆరోపణలు ఎదుర్కుంటున్న కార్తీక్ అనే యవకుడు అడ్డంగా బుక్ అయ్యాడు.
Please Read Disclaimer