రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

0

ప్రముఖ నటుడు రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ ను అధికారులు రద్దు చేసినట్లు సమాచారం. ఆయన ప్రయాణించిన కారు ఇటీవల ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.రాజశేఖర్ ఇప్పటికి 21 సార్లు అతివేగంగా కారును నడిపారని పోలీసులు గుర్తించారు. అత్యధికంగా ఆయన కిలోమీటర్ కు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లారని నిర్దారణ అయిందని సమాచారం. దీంతో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని ట్రాపిక్ డిసిపి విజయ్ కుమార్ సిఫార్స్ చేశారు.నాలుగైదు రోజులలో రవాణా శాఖ ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వనుంది.
Please Read Disclaimer