మరో వారసుడికి మెగాస్టార్ సపోర్ట్

0

టాలీవుడ్ లో వరుసగా వారసులు పరిచయం అవుతూనే ఉన్నారు. ఎంతో మంది నటీ నటుల వారసులు.. సాంకేతిక నిపుణులు హీరోలుగా ఇతర విధాలుగా ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. ఎంతో మంది పరిచయం అవుతుంటే అతి కొద్ది మంది మాత్రమే సక్సెస్ ను దక్కించుకుంటున్నారు.

ఇండస్ట్రీలో పరిచయం అవ్వబోతున్న ప్రతి ఒక్కరు.. పరిచయం అయిన ప్రతి ఒక్క కొత్త నటుడు కూడా మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వాదం.. ఆయన సపోర్ట్ కావాలని కోరుకోవడం చాలా కామన్ విషయం. చిరంజీవి మంచి మనసుతో ఇప్పటికే ఎంతో మంది కొత్త వారిని ప్రోత్సహిస్తూ వారి సినిమాలను ప్రమోట్ చేయడం జరిగింది.

ఇటీవల శ్రీకాంత్ తనయుడు రోషన్ కోసం కూడా చిరంజీవి తనవంతు సహకారంను అందించడం జరిగింది. ఇప్పుడు చిరంజీవి మరో వారసుడికి తన మద్దతు తెలుపుతూ ఇండస్ట్రీలో అతడి ఫ్యూచర్ బాగుండాలని ఆశీర్వదించాడు.

ఆ హీరో మరెవ్వరో కాదు సంగీత సంచలనం కోటి తనయుడు రాజీవ్ సాలూరి. హీరోగా రాజీవ్ ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాకు 11ః11 అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఆ నెంబర్స్ కు కథలో చాలా ప్రాముఖ్యత ఉంటుందట. ఇంట్రెస్టింగ్ పాయింట్ తో రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా చిరంజీవిని ఆ ఆవిష్కరణకు కలవడం జరిగింది.

అయ్యప్ప స్వామి మాలలో ఉన్న చిరంజీవి మంచి మనసుతో రాజీవ్ ను ఆశీర్వదించాడు. కోటి కి చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చిరంజీవి నటించిన పలు సినిమాలకు కోటి కూడా వర్క్ చేశారు. అందుకే కోటి వారసుడి తెరంగేట్రంకు చిరంజీవి తనవంతు సహకారం అందించినట్లుగా పోస్టర్ ఆవిష్కరణకు హాజరు అయ్యారు.

రాజీవ్ సాలూరి హీరోగా కిట్టు నల్లూరి దర్శకత్వంలో ఈ సినిమాను గాజుల వీరేష్ నిర్మిస్తున్నాడు. వర్ష విశ్వనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో కోటి కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. స్వయంగా సంగీత దర్శకుడు అయిన కోటి మరియు ఆయన వారసుడు రాజీవ్ నటిస్తున్న ఈ సినిమాకు సంగీతాన్ని మణిశర్మ అందిస్తున్నాడు.

ఇటీవల విడుదల అయిన రాజీవ్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. తప్పకుండా మంచి హీరోగా రాజీవ్ పేరు దక్కించుకుంటాడనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి చేతుల మీదుగా పరిచయం అవ్వబోతున్న రాజీవ్ కు ముందు ముందు మంచి సినిమాలు వస్తాయేమో చూడాలి.