ఫన్ అంటున్న రామ్ చరణ్

0

టాలీవుడ్ లో ఉన్న టాప్ లీగ్ స్టార్స్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి తనయుడనే టాగ్ మాత్రమే కాదు.. ఈ తరంలో టాలీవుడ్ లో ఉన్న బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘RRR’ అనే మల్టిస్టారర్లో చరణ్ హీరోగా నటిస్తున్నాడు. మరో టాలీవుడ్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ జెనరేషన్ లో మిగతా హీరోలందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు కానీ చరణ్ మాత్రం యాక్టివ్ గా ఉండే వ్యక్తి కాదు. ఫేస్ బుక్ లో మాత్రం తనకు ఖాతా ఉంది. ట్విట్టర్ లో లేదు. తాజాగా ఇన్స్టాగ్రామ్ ఖాతా ఓపెన్ చేశాడు. చరణ్ ఐడి @alwaysramcharan. ఖాతాను ఓపెన్ చేసి రెండు రోజులు కూడా కాలేదు కానీ అప్పుడే చరణ్ కు 234k ఫాలోయర్స్ రెడీ అయ్యారు. చరణ్ కు మెగా ఫ్యాన్స్ ఇంకా తమ కామెంట్ల ద్వారా వెల్కమ్ చెప్తూనే ఉన్నారు.

ఇదిలా ఉంటే చరణ్ సతీమణి ఉపాసన తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోకు “ఫైనల్ గా ఆయన వచ్చాడు. ఇన్స్టాగ్రామ్ లో రామ్ చరణ్” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోలో చరణ్ మాట్లాడుతూ ఇన్స్టాగ్రామ్ లో అడుగుపెడుతున్నానని.. చాలా ఫన్ ఉంటుందని.. అక్కడ కలుద్దామని అన్నాడు”. స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ ఇదంతా మాట్లాడడం విశేషం.

 

View this post on Instagram

 

FINALLY HE MADE IT @alwaysramcharan #ramcharan On @instagram #‪itsgonnabeMAD‬ #friday

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) on
Please Read Disclaimer