చంపితే పట్టించుకోరా అంటున్న ఇస్మార్ట్ శంకర్

0

తన సినిమా బ్లాక్ బస్టర్ అయినా దాన్ని స్వయంగా తనివి తీరా ఆస్వాదించలేని పరిస్థితిలో ముందే ప్లాన్ చేసుకున్న యూరోప్ ట్రిప్ లో హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్ తాలూకు అప్ డేట్స్ కలెక్షన్స్ అన్ని రెగ్యులర్ గా పొందుతూనే ఉన్నాడు. పేరుకి హాలిడే అని ఎంజాయ్ చేయడమే కానీ మనసంతా ఖచ్చితంగా ఇక్కడే ఉండి ఉంటుంది. విడుదలైన రోజు నుంచి ఏది ట్వీట్ చేయకుండా సైలెంట్ గా ఉన్న రామ్ ఫైనల్ గా ఓ కిరాక్ మెసేజ్ పెట్టాడు.

విడుదలకు ముందు రామ్ పాత్ర సిగరెట్ తాగడం అమ్మాయిల మీద కాస్త అతిగా ప్రవర్తించడం గురించి సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా చేస్తారా అని నిలదీసే తరహాలో కొందరు వాటిని వైరల్ చేశారు కూడా. ఛార్మినార్ దగ్గర పబ్లిక్ గా పొగ తాగుతున్నట్టు చేసిన షూట్ సైతం వివాదమయ్యింది ఇప్పుడు అన్నింటికీ కలిపి హోల్ సేల్ గా బదులు చెప్పాడు రామ్.

తాజాగా వేసిన ట్వీట్ లో “హీరో హెల్మెట్ పెట్టుకోలేదు హీరో స్మోక్ చేస్తున్నాడు హీరో అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అని ఎంతసేపు ఇవే గాని హీరో అడ్డం వచ్చినవాళ్ళను చంపుతున్నాడు అని ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు జీవితానికి విలువ లేకుండా పోయింది సాడ్ ” అని చెబుతూ ఇస్మార్ట్ శంకర్ ఏ బాడ్ యాస్ క్యారెక్టర్ అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఫన్నీగా అన్నా రామ్ ఇందులో గట్టి కౌంటర్ ఇచ్చాడు. విమర్శలకు సున్నితంగా అనిపిస్తునే ఘాటుగా బదులిచ్చాడు. వీకెండ్ మొత్తం దున్నేసిన ఇస్మార్ట్ శంకర్ కు ఇప్పుడీ వీక్ డేస్ చాలా కీలకంగా మారనున్నాయి.
Please Read Disclaimer