ఏమిటయా రామ్ ఏమిటా ఫోజు?

0

ఒకే ఒక్క హిట్టు ఎంత ఎనర్జీనిస్తుందో ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న రామ్ ని చూస్తే అర్థమవుతోంది. ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ అతడిలో ఒకేసారి ఎంత ఊపు తెచ్చిందో! ఉన్నట్టుండి లుక్ పూర్తిగా మార్చేశాడు. ఇన్నాళ్లు క్లాస్ గా చాక్లెట్ బోయ్ లుక్ తో స్మార్ట్ గా కనిపించిన రామ్ ఇప్పుడు పూర్తి మాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. రఫ్ గా రగ్గ్ డ్ గా ఎవరూ ఊహించనంతగా మేకోవర్ చూపిస్తున్నాడు.

తాజాగా ఓ అవార్డు కార్యక్రమానికి వెళుతూ ఇలా కెమెరా కంటికి చిక్కాడు. ఈ ఫోటోలో రామ్ ఎంతో రఫ్ గా కనిపిస్తున్నాడు. గుబురు గడ్డం.. ఒత్తయిన మీసం .. దానికి తోడు కండలు పెంచి ఆ షర్ట్ ను అలా మడత పెడుతుంటే ఎవరికైనా మడత పెడతాడేమో అని డౌట్ పుట్టుకొస్తోంది. ఆ హెయిర్ స్టైల్ ని రెమో స్టైల్లో వెనక్కి దువ్వి బ్లాక్ హెయిర్ కి పూర్తిగా ఆపోజిట్ గా బ్రౌన్ గ్లాసెస్ ని పెట్టుకుని స్టైల్ గా అలా నడుచుకుంటూ వెళుతుంటే చూపరుల కళ్లన్నీ రామ్ పైనే.

వ్వాటే మేకోవర్ మిస్టర్ రామ్ పోతినేని. నీలో కీనూ రీవ్స్ ఎనర్జీ కనిపిస్తోంది. మ్యాట్రిక్స్ రోబోల స్టైల్ ఇమిడి ఉంది. ఇస్మార్ట్ శంకర్ గా మాస్ ఎనర్జీతో మతి చెడగొట్టావు. ఇకపై ఏం చేయబోతున్నావో ఏమిటో కానీ.. ఇప్పటికి ఈ లుక్ చూసి గాళ్స్ పరేషాన్ అయిపోతున్నారంటే అతిశయోక్తి కాదేమో! టాప్ టు బాటమ్ బ్లాక్ లో కనిపించాడు. పైగా వైట్ ఛారల షర్ట్ సగభాగం బ్లాక్ లో కిరాక్ కాంబినేషన్ అనే చెప్పాలి. ఇక ఇదంతా కిషోర్ తిరుమలతో రెడ్ సినిమా కోసమేనా? అన్నది రామ్ చెప్పాల్సి ఉంది.

రామ్- కిషోర్ తిరుమల కాంబినేషన్ మూవీ రెడ్ ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్ సరసన నివేద పేతురాజ్ – మాళవిక శర్మ నాయికలు. అలాగే ఈ చిత్రంలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్న ప్రచారం ఉంది. నేను శైలజ-ఉన్నది ఒకటే జిందగీ తర్వాత రామ్ -కిషోర్ తిరుమల కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. స్రవంతి రవికిషోర్ నిర్మిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పీటర్ హెయిన్స్ .. సమీర్ లాంటి టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు.
Please Read Disclaimer