రామ్ కూడా అదే చెప్పాడుగా!

0

టాలీవుడ్లో రీమేకులు సర్వసాధారణమైపోయాయి. అగ్ర దర్శకుల నుండి వరకు అందరూ రీమేక్ లోనే నమ్ముకుంటున్నారు. లేటెస్ట్ గా వచ్చిన రాక్షసుడు అలాగే వాల్మీకి సినిమా కూడా విజయవంతమవడంతో ఇప్పుడు అందరి చూపు రీమేక్ లా మీదే పడింది.

ఇప్పుడు హీరో రామ్ కూడా ఓ రీమేక్ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ప్రారంభమైన రామ్ రెడ్ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన తడం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.

అయితే ఈ సినిమా రీమేక్ అనే విషయాన్ని ఇంతవర కు ప్రకటించలేదు. తాజాగా సినిమా ప్రారంభం సందర్భంగా రీమేక్ విషయంపై స్పందించాడు రామ్. నిజానికి ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ చాలా మార్పులు జరిగాయని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇతర భాష సినిమా లను రీమేక్ ఇప్పటికే మేకర్స్ మాత్రం ఇది అచ్చుగుద్దినట్టు రీమేక్ గా తెరకెక్కించడం లేదని చెప్తున్నారు. అయితే ఇప్పుడు హీరో రామ్ కూడా అదే చెప్పు కొట్టాడు. మరి సినిమాలో నిజంగానే మార్పులు జరిగాయా లేదా అనేది సినిమా చూశాక తెలుస్తుంది.
Please Read Disclaimer