గన్స్ పట్టి మ్యాట్రిక్స్ స్టార్ లా అవుతాడా?

0

ఇస్మార్ట్ రామ్ ఈ కొత్త గెటప్ చూస్తుంటే ఏదైనా సందేహం కలుగుతోందా? మాఫియా నుంచి తుపాకులు దిగుమతి చేసుకుంటున్న తీరుగా ఆ గెటప్ చూస్తుంటే కాస్త డిఫరెంటుగా.. భీకరంగానే కనిపిస్తోంది. అసలే గెటప్ ఛేంజ్ చేసి ఇస్మార్ట్ గా మారిన రామ్ ఇప్పుడిలా సడెన్ గా అన్ని రకాల తుపాకులు.. రైఫిల్స్.. ఏకే 47 లాంటివి పట్టుకుని ఇలా ప్రాక్టికల్ గా చెక్ చేస్తుంటే ఆయుధాల వ్యాపారిలా కాస్త కొత్తగానే కనిపిస్తున్నాడు.

అసలింతకీ అవి రియల్ గన్సేనా? అంటే .. ఎలాంటి సందేహం అక్కర్లేదు. నిజమైన గన్స్ పట్టుకుని ఇదిగో ఇలా ప్రాక్టికల్ గా చెయ్యేసి చూశాడు. ఇవన్నీ రక్షణదళాలు- పారామిలటరీ-పోలీస్ శాఖలకు సంబంధించిన రియల్ లైవ్ తుపాకులేనట. ఇందులో పాతికేళ్లుగా సేకరించిన తుపాకులు.. ఏకే 47 లు వంటివి ఉన్నాయి. వీటిని జెన్ టెక్నాలజీస్ సంస్థ హైదరాబాద్ లో నిర్వహించిన రజతోత్సవ కార్యక్రమంలో ప్రదర్శించింది.

ఎంఎంజీ- ఏజీఎల్- ఏటీజీఎమ్- సీటీఎస్.ఆర్- ఏకే 47… ఇలా రకరకాల ఆయుధాల్ని పట్టుకుని ప్రాక్టికల్ గా చెక్ చేసి వాటి టెక్నికాలిటీస్ ని అడిగి మరీ తెలుసుకున్నాడట రామ్. ఒకవేళ లైవ్ లో ఆన్ సెట్స్ తుపాకులు పట్టుకుని సాహసాలు చేయాల్సి వస్తే .. ఈ ప్రాక్టీస్ నే స్ఫూర్తిగా తీసుకుంటాడట. ఇలాంటి స్పెషల్ ఈవెంట్ కి తనని ఆహ్వానించినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. ఆర్మీదళాలు.. పోలీస్ కి.. నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపాడు.
Please Read Disclaimer