కుర్ర హీరోకి ఆ రీమేక్ వర్కౌట్ అవుద్దా?

0

టాలీవుడ్ లో ఇప్పటికే కొందరు సీనియర్ హీరోలు కొన్ని సినిమాల్లో డ్యుయల్ రోల్ చేసి ప్రేక్షకులను మెప్పించారు. అయితే కొన్ని డ్యుయల్ రోల్ సినిమాలు వర్కౌట్ అవ్వలేదు కూడా. ఇక డ్యుయల్ రోల్ అంటే ఆశా మాషీ కాదు. ఏ మాత్రం ఫోకస్ తప్పినా సినిమా రిజల్ట్ తేడా కొడుతుంది అయితే ఇప్పుడు రామ్ ‘రెడ్’ సినిమాలో డ్యుయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. అయితే ఇప్పటి వరకూ 17 సినిమాలు చేసిన రామ్ ఈ సినిమాలో డ్యుయల్ రోల్ చేయడానికి రీజన్ ఉంది.

‘రెడ్’ సినిమా తమిళ సూపర్ హిట్ ‘తడం’ కు రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇందులో రెండు విభిన్న పాత్రల్లో అరుణ్ విజయ్ అదరగోట్టేసాడు. అందుకే సినిమా అక్కడ ఆ రేంజ్ లో సక్సెస్ అయింది. ఇక్కడ రామ్ అదే మేజిక్ రిపీట్ చేయగలడా అనే అనుమానాలు ఉన్నాయి. అయితే రామ్ ఎనర్జీ ఒక్కటే అందరికీ సమాధానం. రవితేజ తర్వాత అంత ఎనర్జీతో నటించగలడు. పైగా కిషోర్ తిరుమలకి క్రైం థ్రిల్లర్ జోనర్ లో ఎక్స్ పీరియన్స్ లేదు. అయితే ఇది రీమేక్ కాబట్టి పరవాలేదు.

ఈ లెక్కన చూస్తే రామ్ రెండు క్యారెక్టర్స్ లో తన ఎనర్జీ చూపించి మెప్పించే చాన్స్ ఉంది. మరి రామ్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో తెలియాలంటే వచ్చే ఏడాది మార్చ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
Please Read Disclaimer