గడ్డం మీటర్ కొంచెం తగ్గించిన రానా

0

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి అప్పుడప్పుడూ తన లుక్స్ చేస్తూ అందరికీ షాకులు ఇస్తుంటాడు. ఒకసారి స్లిమ్ గా ఉంటాడు మరోసారి భల్లాల దేవుడిగా భారీగా మారిపోతాడు. ఒకసారి క్లీన్ షేవ్ లో కనిపిస్తాడు. మరోసారి మీసాలు మాత్రమే పెంచుతాడు. ఇంకోసారి పొడవాటి గడ్డం పెంచి రుషిని తలపిస్తాడు. ప్రస్తుతం గడ్డం గెటప్ లోనే ఉన్నాడు కానీ కొంచెం ట్రిమ్ చేయించుకున్నాడు.

రానా సోషల్ మీడియాలో యాక్టివ్ కదా.. అందుకే తన లుక్ లో వచ్చిన మార్పును అభిమానులతో పంచుకున్నాడు. హెయిర్ కట్.. బియర్డ్ ట్రిమ్మింగ్ కు ముందు ఫోటో.. తర్వాత ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసి “ఈ నెలకు క్లీన్ అయింది” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. మొదటి ఫోటోలో కొంచెం పొడవైన జుట్టు.. గజిబిజిగా ఉన్న గడ్డంతో ఉన్నాడు. అదే రెండవ ఫోటోలో మాత్రం షార్ట్ హెయిర్ కట్.. పర్ఫెక్ట్ గా షేప్ చేసిన గడ్డంతో కనిపిస్తున్నాడు. ఈ ఫోటోలకు నెటిజనులు సూపర్ కామెంట్లు పెట్టారు. “అన్నా అగడ్డం ఏపుగా పెరుగుతోంది ఏం ఆయిల్ వాడుతున్నావో చెప్పు” అంటూ ఒకరు.. “మీ పొడవు గడ్డం నచ్చలేదు.. లైట్ గా ఉంటేనే మీరు సూపర్ గా ఉంటారు” అంటూ కామెంట్లు పెట్టారు.

రానా సినిమాల విషయానికి వస్తే ‘హాథి మేరె సాథి’.. ‘హౌస్ ఫుల్ 4’.. ‘విరాటపర్వం 1992’.. ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ చిత్రాలలో నటిస్తున్నాడు. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు ప్లానింగ్ దశలో ఉన్నాయి.
Please Read Disclaimer