పవన్ గురించి డిసప్పోయింట్ అయిన కుర్ర హీరో!

0

అప్పుడప్పుడే ఎదుగుతున్న ఓ కుర్ర హీరో సినిమాకి కొంత హైప్ వచ్చి ఆ సినిమా ఫంక్షన్ కి క్రేజ్ ఉన్న ఓ స్టార్ హీరో గెస్ట్ గా వస్తే ఆ కిక్కే వేరు. అయితే రెండు రోజుల క్రితం ఇదే కిక్ పొందాడు సందీప్ అలియాస్ సాండీ. జ్యోతి లక్ష్మి తో నటుడిగా పరిచయమైన సందీప్ ఆ తర్వాత వర్మ డైరెక్ట్ చేసిన ‘వంగవీటి’ లో రాధా – రంగా గా నటించాడు. ఆ సినిమా అనుకున్నంత రేంజ్ కి వెళ్ళలేదు. కానీ సందీప్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమా తర్వాత టైం తీసుకొని మళ్ళీ జీవన్ డైరెక్షన్ లో ‘జార్జ్ రెడ్డి’ అనే మరో బయోపిక్ సినిమా చేసాడు.

ఈ సినిమా టీజర్ – ట్రైలర్ సోషల్ మీడియా సెన్సేషన్ క్రియేట్ చేసాయి. తెలంగాణాలో ఓ పవర్ ఫుల్ స్టూడెంట్ లీడర్ బయోపిక్ కావడంతో యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేసిందీ సినిమా. అయితే ఈ సినిమా ట్రైలర్ చూసిన పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తానని మాటిచ్చి ఏర్పాట్లు చేసుకోమని టీం కి తెలియజేసాడు.

కట్ చేస్తే పీపుల్ ప్లాజా జరగే ఈవెంట్ కి భద్రతా ద్రష్ట్యా పర్మిషన్ ఇవ్వలేదు. దాంతో ఈవెంట్ క్యాన్సల్ అయింది. ఇక తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ తన సినిమా ఈవెంట్ కి గెస్ట్ అని ఓ తెగ సంబరపడిన సందీప్ ఆశలు నిరాశయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా ఇంటర్వ్యూలో తెలిపాడు సందీప్. ఆ విషయంలో చాలా డిసప్పోయింట్ అయ్యానని తెలిపాడు.
Please Read Disclaimer