మెగా హీరోకి బావమరిదిగా అక్కినేని హీరో ?

0

బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠ పురములో’ జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం అన్నపూర్ణ ఏడెకరాల్లో వేసిన హౌజ్ సెట్ లో బన్నీ- టబు- సుశాంత్ – వెన్నెల కిషోర్ లపై సీన్స్ తీస్తున్నారు. ఈ సినిమాలో సుశాంత్ ని ఓ స్పెషల్ రోల్ కోసం తీసుకున్నాడు త్రివిక్రమ్. అయితే సుశాంత్ రోల్ గురించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు.

లేటెస్ట్ గా అందిన సమాచారం మేరకూ సినిమాలో సుశాంత్ బన్నీ కి బావ మరిదిగా నటిస్తున్నాడని తెలుస్తుంది. అంటే సుశాంత్ పూజకి బ్రదర్ గా అన్నమాట. ఇంకా ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పుడే ఈ విషయం బయటికొచ్చే సమస్యే లేదు. రిలీజ్ వరకూ సుశాంత్ రోల్ పై మేకర్స్ ఎలాంటి క్లూ ఇవ్వరు కూడా. సినిమాలో బన్నీ సుశాంత్ మధ్య కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయట.అవి థియేటర్ లో బాగా పేలతాయని ఇసైడ్ టాక్.

మరి ‘చిలసౌ’తో డీసెంట్ హిట్ అందుకున్న సుశాంత్ ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ చేస్తుండటం విశేషమే. ఈ సినిమా తరువాత కూడా ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ వస్తే చేసేటట్లే ఉన్నాడు అక్కినేని హీరో. మరి ‘అల వైకుంఠపురములో’ సినిమా సుశాంత్ కెరీర్ కి ఎంత వరకూ కలిసొస్తుందో చూడాలి. సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి జస్ట్ అబోవ్ యావరేజ్ అనిపించుకున్నా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం. ఈ లెక్కన సుశాంత్ ఓ బ్లాక్ బస్టర్ సినిమాలో పార్ట్ అయ్యానని సంతృత్తి చెందుతాదేమో.
Please Read Disclaimer