అఖిల్ తర్వాత సుశాంత్ కి గాయం!

0

వరుస యాక్సిడెంట్లు.. గాయాలు పరిశ్రమను భయపెడుతున్నాయి. హీరోలకు గాయాలవుతుండడంతో విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోంది. దాంతో షూటింగ్ షెడ్యూల్స్ వాయిదా వేసుకోవాల్సిన దుస్థితి తలెత్తుతోంది. ఇది నిర్మాతకు చాలా భారమే. నేటి ఉదయమే అక్కినేని అఖిల్ కి ఆన్ లొకేషన్ యాక్సిడెంట్ లో చిన్నపాటి గాయం అయ్యిందని వార్త అందింది. దీని వల్ల వారం పాటు షెడ్యూల్ వాయిదా పడింది. ప్రమాదం తప్పినా.. చిన్న గాయమే అయినా సెట్స్ పై ఉన్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` కి ఇదో డిస్ట్రబెన్స్ అంటూ వాపోవాల్సిన పరిస్థితి.

ఇక అక్కినేని కాంపౌండ్ లోనే మరో హీరోకి గాయం అయ్యిందన్నది తాజా వార్త. యంగ్ హీరో సుశాంత్ ప్రస్తుతం #నో పార్కింగ్.. ఇచట వాహనాలు నిలుపరాదు అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ సెట్స్లో సుశాంత్ గాయపడ్డాడట. ఆ విషజ్ఞాన్ని స్వయంగా ధృవీకరించాడు. తన ట్విట్టర్ లో సుశాంత్ తన గాయానికి సంబంధించిన ఫోటోని పోస్ట్ చేసి.. “# నోపార్కింగ్ లో పార్క్ చేయకూడదు! ఇప్పుడిప్పుడే థింగ్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. నా షూటింగుకి ఇదే చివరి రోజు“ అంటూ వ్యాఖ్యను జోడించాడు.

`ఇచట వనాములు నిలుపరాదు` చిత్రానికి సంబంధించిన లుక్ ఇప్పటికే రిలీజై ఆకట్టుకుంది. పరిశ్రమలో ఈ మూవీపై కొన్ని పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఈ చిత్రంతో కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. అలాగే కొత్త హీరోయిన్ కూడా అడుగుపెడుతోంది. ఎస్. దర్శన్ దర్శకుడిగా లక్ చెక్ చేసుకుంటుండగా.. మాజీ మిస్ ఇండియా మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. క్రైమ్ కామెడీ జానర్ చిత్రమిది. ఈ చిత్రాన్ని రవిశంకర్ శాస్త్రి- హరీష్ కోయలగుండ్ల నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చి.ల.సౌ తర్వాత ఎన్నో హోప్స్ తో సుశాంత్ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. మరి లక్ చిక్కుతుందా లేదా? అన్నది చూడాలి.
Please Read Disclaimer