టీజర్ టాక్: హీరో

0

విశాల్ తో ‘ఇరుంబుతిరై'(తెలుగులో ‘అభిమన్యుడు’) చిత్రాన్ని తెరకెక్కించి ప్రశంసలు అందుకున్న పీఎస్ మిత్రన్ డైరెక్షన్ లో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన తమిళ సినిమా ‘హీరో’. ఈ ట్రైలర్ ను బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ రీసెంట్ గా విడుదల చేశారు. ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్.. ఇవానా.. యాక్షన్ కింగ్ అర్జున్.. బాలీవుడ్ హీరో అభయ్ డియోల్ ఈ సినిమాలో ఇతర కీలకపాత్రల్లో నటించారు. ఇది సూపర్ హీరో కం థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన చిత్రం.

ఒకటిన్నర నిముషం టీజర్ లో పెద్దగా స్టొరీ రివీల్ చెయ్యలేదు కానీ స్టొరీ లైన్ మాత్రం రఫ్ గా చెప్పారు. అర్జున్ ఒక సీన్ లో హీరో శివకార్తికేయన్ తో “ఇక్కడ ప్రతి ఒక్కరికీ చదువుకునే అవకాశం దక్కుతుంది. కానీ అందరికీ(తాము అనుకున్నది) సాధించే అవకాశం దొరకదు. ఈ వ్యవస్థను మార్చేందుకు కామన్ మ్యాన్ సరిపోడు.. ఒక హీరో కావాలి” అని చెప్తాడు. సో.. వ్యవస్థను మార్చేందుకు శివకార్తికేయన్ నడుం బిగిస్తాడన్నమాట. ఇక విలన్ పాత్రలో అభయ్ డియోల్ “నీ పని నువ్వు చూసుకో- ఇదే మన విద్యా వ్యవస్థ విద్యార్థులకు నూరిపోసేది” అంటాడు. మరో సందర్భంలో “(స్టూడెంట్)ఎ ఫర్ యాపిల్ అంటే అతను మనకు ఒక ప్రాడక్ట్. అదే ఎ ఫర్ ఏరోప్లేన్ అన్నాడంటే అతను మనకు ఓ పోటీదారు” అంటాడు.

ఒక సామాజిక అంశాన్ని తీసుకుని వ్యవస్థను బాగుచేయడం కోసం ఒక సూపర్ హీరో శ్రమించడం అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. దీనిని యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో సరిగ్గా ప్రెజెంట్ చేస్తే మాత్రం హిట్టు గ్యారెంటీ. టీజర్ చూస్తే మాత్రం ఆసక్తికరంగా ఉంది. స్టార్ కాస్ట్ బాగుంది. యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ఆలస్యం ఎందుకు.. చూసేయండి తమిళ హీరోను.
Please Read Disclaimer