వీక్ ప్రమోషన్స్ తో అప్సెట్ అయిన హీరో?

0

ఒక సినిమాకు కంటెంట్ ఎంత ముఖ్యమో ప్రమోషన్స్ కూడా అంతే ముఖ్యం. మంచి సినిమా తీసి రిలీజ్ చేస్తే సరిపోతుంది కదా.. అంటే అసలు సరిపోదు. కారణం ఒక సినిమాకు మొదటి వీకెండ్ లో వచ్చే వసూళ్లే కీలకం. సినిమాకు విడుదలకు ముందు బజ్ లేకపోతే ఆ సినిమాను ప్రేక్షకులు పట్టించుకోరు. అలా పట్టించుకాకపోతే మొదటి వారాంతంలో నామమాత్రపు కలెక్షన్లే వస్తాయి. అందుకే అల్లు అర్జున్.. మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ హీరోలే తమ సినిమాల ప్రమోషన్స్ భారీ స్థాయిలో మూడు నెలల ముందు నుంచి చేశారు. భారీ కలెక్షన్స్ సాధించారు. అయితే అన్ని సినిమాల పరిస్థితి అలా ఉండదు కదా!

త్వరలో రిలీజ్ కానున్న ఒక సినిమాకు ప్రమోషన్స్ తూతూమంత్రంగా సాగుతున్నాయి. ఒక సూపర్ హిట్ సినిమాకు రీమేక్ అయినప్పటికీ ఏమాత్రం బజ్ లేదు. ఒక సూపర్ హిట్ సినిమా రిమేక్ అంటే మీడియా లో ఎంత సందడి ఉండాలి? కానీ అ సినిమా టీమ్ ప్రమోషన్స్ ను నిర్లక్ష్యం చేయడంతో రావల్సినంత బజ్ కూడా రాలేదు. దీంతో హీరోగారు ఆ నిర్మాత తీరుపై అప్సెట్ అయ్యారట. ఈ ప్రమోషన్స్ విషయంలో నిర్మాతకు హీరోగారికి సీరియస్ డిస్కషనే జరిగిందట. మరి ఆ చర్చలు సఫలం అయ్యాయో లేదో తెలియదు కానీ హీరోగారు మాత్రం తన వ్యక్తిగత పీఆర్ టీమ్ తో కాస్తయినా ప్రచారం కల్పించాలని రెడీ అయ్యారట. ఎలాగైనా ఈ సినిమాను పుష్ చెయ్యమని తన పీఆర్ టీమ్ ను కోరుతున్నారట.

మంచి సబ్జెక్ట్.. హిట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్న సినిమాలో నటించి కూడా రిలీజుకు ముందు ఈ టెన్షన్ ఏంటోనని హీరోగారు తెగ చిరాకు పడుతున్నారట. మరి ఈ హీరోగారి పర్సనల్ ప్రమోషన్స్ తో అయినా ఆ సినిమాకు కాస్త హైప్ పెరుగుతుందా.. బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం లభిస్తుందా అనేది చూడాల్సి ఉంది.
Please Read Disclaimer