వెంకీ మామలోని ప్రకృతి ప్రేమికుడు

0

మడిషన్నాక కూసింత కళాపోషణ ఉండాల! ఊరికే తిని కూకుంటే మడిషికి.. గొడ్డుకి తేడా ఏటుంటాది? అన్నారు మహనీయుడు రావు గోపాల్రావ్. ఆ మాటల్ని ప్రతి ఒక్కరూ పదే పదే స్ఫురణకు తెచ్చుకోవాలి. ఆయన మాటను తూ.చ తప్పక పాటించాలి. అసలు కళాపోషణ అంటే ఇలా ఉండాలి? అనేందుకు ఈ ఫోటోనే ఎగ్జాంపుల్.

ఆస్వాధించే మనసుండాలే కానీ.. ప్రతి సాయం సంధ్యను ఇలా అనుభవించి ఫలవరించాలి. సాయం సంధ్య వేళ ఎర్రని సూర్యుడు సుదూరంలోని కొండల అంచుకు జారిపోతుంటే ఆ దృశ్యాన్ని చూసేవాళ్లకు మనసంతా పులకరిస్తుంది. బూడిద రంగు మబ్బుల్లో పరుచుకున్న ఆ ఎర్రెర్రని రంగు సరికొత్త శోభను తెస్తుంది. మనసుకు ఆహ్లదాన్ని పంచుతుంది. ఆ దృశ్యం చూస్తే ఆనందం ఆవర్ణం అవుతుంది. ఇక్కడ విక్టరీ వెంకటేష్ అలాంటి తాధాత్మ్యంలోనే ఉన్నారని అర్థమవుతోంది.

నగర జీవులకు ప్రకృతి ఇంత అందంగా ఉంటుందని తెలుసా? సాయంత్రం వేళ ఆకాశంలోకి చూసేవాళ్లు ఎందరు? సూర్యాస్తమయాన్ని ఆస్వాధించే మనసు ఎందరికి ఉంది? ప్రకృతి జీవనానికి ఎవరు ఎంత దగ్గరగా ఉన్నారు? ఇన్ని ప్రశ్నలు ఈ ఫోటోలో పరోక్షంగా రీసౌండ్ ఇస్తూనే ఉన్నాయి. ఒత్తిళ్ల జీవనానికి అలవాటు పడిపోయిన చాలా మందికి ఇది కనువిప్పు అనే చెప్పాలి. “ఒక సాయంత్రాన్ని ఇంతందంగా గడపడం అంటే నాకు చాలా చాలా ఇష్టం“ అంటూ వెంకీ ఈ ఫోటోని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. సహజంగానే ఆధ్యాత్మికతను ఇష్టపడే వెంకీ వివేకానందుడికి ఫాలోవర్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న వెంకీమామ (వెంకీ-చైతూ హీరోలు) శరవేగంగా పూర్తవుతున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer