ఎంత గారాల కొడుకైనా ఏంటిది చియాన్?

0

చియాన్ విక్రమ్ వ్యవహార శైలి చూస్తుంటే ఓవర్ ప్రొటెక్టివ్ డాడ్ అనాల్సిందే. తన నటవారసుడి డెబ్యూ మూవీ కోసం తానేం త్యాగం చేస్తున్నాడో చూస్తుంటే ఆశ్చర్యపోకుండా ఉండలేం. అసలు తన సినిమాల గురించి తనకేమీ పట్డం లేదు. కొడుకు ధృవ్ గురించే టెన్షన్ అంతా. అతడు ఎక్కడ ఉంటే అక్కడ చియాన్ కనిపిస్తున్నారు. ఆన్ లొకేషన్ షూటింగ్ .. లేదా ఏదైనా థియేటర్ కి వెళ్లినా అక్కడ కొడుకు వెంటే నాన్న కనిపిస్తున్నారు. అసలు కొడుకుని వదిలి ఉండలేని తండ్రిగా చియాన్ ప్రేమాభిమానాలు ఆ ఆత్రం చూస్తుంటే .. మరీ ఇంతగానా అనిపించక మానదు.

లేటెస్టుగా విక్రమ్ నటించిన `కడరమ్ కొండాన్` (మిస్టర్ కేకే) రిలీజైన సంగతి తెలిసిందే. తమిళనాడులో ఈ సినిమా ఆడుతున్న కాశీ అనే ఓ థియేటర్ విజిటింగ్ కి ధృవ్ వెళ్లాడు. అక్కడ కూడా కొడుకుని విడిచి తండ్రి .. తండ్రిని వీడి కొడుకు ఉండలేకపోయారని తాజాగా రివీలైన కొన్ని ఫోటోలు చెబుతున్నాయి. ప్రతి చోటా కొడుక్కి విక్రమ్ షాడోలా వెంటపడుతుండడం స్పష్టంగా కనిపిస్తోంది.

అంత ఓవర్ ప్రొటెక్టివ్ కాకపోతే ఒకసారి తెరకెక్కించిన సినిమాని పూర్తిగా స్క్రాప్ లో వేయించి మళ్లీ తీయిస్తాడా? అంటూ అప్పట్లోనే చర్చ సాగింది. ఇక ధృవ్ నటిస్తున్న `ఆదిత్య వర్మ` (అర్జున్ రెడ్డి రీమేక్) రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా రిలీజయ్యే వరకూ అసలు కొడుకుని చియాన్ విడిచి పెట్టేట్టే లేడు. ఇక ఇప్పటికే ఆదిత్య వర్మ టీజర్ రిలీజై అభిమానుల్ని మెప్పించింది. చియాన్ నటవారసుడి తొలి సినిమా ఎలా ఉండబోతోంది? అన్న ఎగ్జయిట్ మెంట్ కనిపిస్తోంది. ఇక డాడ్ లానే ధృవ్ చాక్లెట్ బోయ్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. అతడికి యువతరంలో ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. తమిళ సినిమా హిస్టరీలో అతడికి ఓ పేజీ ఉంటుందో లేదో తెలియాలంటే కాస్త ఆగి చూడాల్సిందే.
Please Read Disclaimer