కెరీర్ బాగోలేకపోవడంతోనే ఆ నటుడి విడాకులు?

0

ఇటీవలే ఒక ప్రముఖ నటుడు తన విడాకుల అంశాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. చాలా కాలం నుంచినే అతడు హీరోగా ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నాడు. దశాబ్దంన్నర ముందు నుంచినే ప్రయత్నాలు సాగిస్తున్నా.. ఇన్నేళ్లలో సరైన హిట్ లు రెండు మూడు కూడా కొట్టలేకపోయాడు.

అక్కడకూ సొంత నిర్మాణ సంస్థ – పక్క భాషల్లో హిట్టైన కథలను రీమేక్ చేయడం..ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో చేశాడు. తనకంటూ ఒక మార్క్ ను సృష్టించుకునే ప్రయత్నం చేశాడు. అయితే అతడికి లక్ కూడా అంత కలిసి రాలేదు. కొన్ని సినిమాలు ఫర్వాలేదనిపించుకున్నా – టీవీల్లో బాగా ఆడాయి కానీ – థియేటర్లలో ఆడలేదు.

ఇక కెరీర్ సవ్యంగా లేనప్పుడు కొందరికి కుటంబంలో కూడా సమస్యలు మొదలవుతాయి. ఏ పని చేసే వారికి అయినా అలాంటివి తప్పవు. వరస ఫెయిల్యూర్స్ ఆ నటుడిని వ్యక్తిగతంగా కూడా ఇబ్బంది పెట్టాయని సమాచారం. ఈ క్రమంలో ఇగో ఫీలింగ్స్ కూడా తలెత్తాయని – ఒక బడా ఫ్యామిలీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అతడు.

దీంతో వారి మధ్యన ఫైట్ మొదలైందని – గొడవలు రేగాయని..అందుకే విడిపోవడమే ఉత్తమ మార్గంగా భావించాడట ఆ నటుడు. కొట్లాడుతూ కలిసి ఉండటం కంటే విడిపోవడమే మేలనే నిర్ణయానికి వచ్చి వారు ఎవరి దారి వారు చూసుకున్నారని ప్రచారం సాగుతూ ఉంది.
Please Read Disclaimer