ఫ్లాపులతో ఆర్థిక కష్టాల్లో హీరో..సాయమైనా చేయరా!

0

ఆ యంగ్ హీరోకి ఎన్ని ఫ్లాపులొచ్చినా ఒకదాని వెంట ఒకటిగా సినిమా ఛాన్సులు వస్తూనే ఉన్నాయి. అయితే అందుకు రకరకాల కారణాలు ఉన్నాయి. పారితోషికం లేకుండా నటిస్తాడు. పైగా సినిమా అంటే ప్రాణం పెట్టి ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంటాడు. సినిమా కోసం వర్క్ చేసి .. అందులో తన సొమ్ముల్ని పెట్టుబడిగా పెడుతుంటాడు. ఎంతో హార్డ్ వర్క్ చేసి నిర్మాతలకు సాయం అవుతాడు. సినిమాలంటే తనకు ఉన్న ఫ్యాషన్ తన చేత అలా చేయిస్తోంది.

అయితే ఇలా చాలా సినిమాలు చేసినా అందులో ఒకట్రెండు మాత్రమే హిట్లు వచ్చాయి. దీంతో కెరీర్ ఆశించినంతగా వెలగలేదు. అయినా ప్రయత్నాలు మాత్రం విడువడు. ఇటీవల వరుస ఫ్లాపులతో ఇబ్బంది అవ్వడం వల్ల ఆర్థికంగానూ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. అయితే అతడు ఇలాంటి సన్నివేశంలో ఉన్నా ఆర్థికంగా సాయం చేసేందుకు స్నేహితులు ఎవరూ ముందుకు రావడం లేదట.

ఇప్పటికైతే వరుసగా ఛాన్సులు వస్తున్నాయి. కానీ డబ్బులు రావడం లేదు. హిట్లు అసలే దక్కడం లేదు. సరైన హిట్టు పడితే దారికొస్తాడు. ఆర్థికంగా కష్టం తీరాలంటే బ్లాక్ బస్టర్ పడితే ఎవరైనా అడ్వాన్సులు ఇచ్చేందుకు ముందుకు రావొచ్చు. ఈలోగానే స్నేహితులైనా ఆదుకోకపోతే కష్టమే.
Please Read Disclaimer