కేజీఎఫ్ స్టార్ అలా డిసైడ్ అయ్యాడట

0

కన్నడ ప్రేక్షకులు రాకింగ్ స్టార్ అని ప్రేమగా పిలుచుకునే యష్ ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ చిత్రంతో దేశవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘కేజీఎఫ్’ అన్ని భాషలలో విజయం సాధించడంతో నిర్మాతలు రెండో భాగాన్ని మరింత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా చాప్టర్ 2 ను రెడీ చేస్తున్నారు.

అవసరమైతే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కించేందుకు హాలీవుడ్ టెక్నిషియన్లను తీసుకునే ఆలోచనలో కూడా ఉన్నారట. కానీ యష్ మాత్రం లోకల్ టెక్నిషియన్లు వారికి ఏమాత్రం తీసిపోరని..వీలైనంతవరకూ లోకల్ టెక్నిషియన్లతోనే షూటింగ్ చేద్దామనే అభిప్రాయం వ్యక్తం చేశాడట. ఒకరకంగా అదీ నిజమే.. హాలీవుడ్ టెక్నిషియన్స్ కు ఇచ్చే బడ్జెట్ మన లోకల్ టెక్నిషియన్స్ కు ఇవ్వరు కాబట్టి మనవాళ్ళ క్వాలిటీ తక్కువగా ఉందని అనిపించడం సహజమే. టాలెంట్ విషయం లో మాత్రం మనవాళ్ళు ఎవరికీ తీసిపోరు.

ఇదిలా ఉంటే మరో విషయంలో కూడా యష్ నిర్ణయం తీసుకున్నాడట. ‘కేజీఫ్: చాప్టర్ 2’ చేసేలోపు మరో సినిమా చేయాలనే ఆలోచన యష్ కు ఉండేదట. కానీ ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ కు వచ్చిన రెస్పాన్స్ ను చూసిన తర్వాత గ్యాప్ లో మరో సినిమా చేసే ఆలోచనను పక్కన పెట్టాడట. యష్ ను చూస్తుంటే.. ప్రభాస్ ను శ్రద్ధగా ఫాలో అవుతున్నట్టుగా ఉంది కదా. ‘బాహుబలి’ షూటింగ్ సమయంలో మొదటి భాగానికి రెండో భాగానికి గ్యాప్ ఉన్నా ప్రభాస్ మాత్రం మరో సినిమాపై ఫోకస్ పెట్టలేదు ఇప్పుడు యష్ కూడా అదే రూట్ లో ఉన్నాడు.
Please Read Disclaimer