చినబాబు కోసం చెన్నై బ్యూటీ ఫిక్స్?

0

అఖిల్ అక్కినేని తన కొత్త సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా నటించే హీరోయిన్ ఎవరన్న విషయంపై చాలారోజులుగా డిస్కషన్స్ కొనసాగుతున్నాయి కానీ ఇంకాఎవరూ ఫైనలైజ్ కాలేదు. ఇంతలోపు స్పెక్యులేషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. తాజాగా అఖిల్ కు హీరోయిన్ గా ఓ కొత్త భామ పేరు వినిపిస్తోంది.

నాని-విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో హీరోయిన్ గా నటించిన చెన్నై బ్యూటీ అరుళ్ మోహన్ ను అఖిల్ కోసం ఫైనలైజ్ చేశారని అంటున్నారు. ‘గ్యాంగ్ లీడర్’ సినిమా విడుదల కాకముందే అరుళ్ మోహన్ కు ఇండస్ట్రీ సర్కిల్స్ లో మంచి పేరు వచ్చింది. నటన.. గ్లామర్ రెండూ ఉన్న నటి అని.. టాలీవుడ్ లో బ్రైట్ ఫ్యూచర్ ఉందని టాక్ రావడంతో పలువురు యంగ్ హీరోలు తమ సినిమాల్లో హీరోయిన్ గా తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని కూడా అన్నారు. ఇప్పుడు అఖిల్ కు జోడీగా అవకాశం రావడం లక్కీ ఛాన్సే అని చెప్పాలి. అఖిల్ కు ఇప్పటివరకూ హిట్లు లేకపోయినా గీతా ఆర్ట్స్ సంస్థ నుండి వస్తున్న చిత్రం కావడంతో విజయం సాధించే అవకాశాలు ఎక్కువ.

రొమాంటిక్ కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో అఖిల్ కు మంచి హిట్ వస్తుందని అక్కినేని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. గీతా ఆర్ట్స్ లో తెరకెక్కిన ‘100% లవ్’ అప్పట్లో నాగచైతన్యకు ఒక మెమొరబుల్ ఫిలింగా నిలిచింది. అదేకోవలో ఇప్పుడు తమ్ముడు అఖిల్ కు కూడా ఒక హిట్ వచ్చే అవకాశం ఉందని అభిమానుల ఆశ.
Please Read Disclaimer