బాసుకు హీరోయిన్ ను ఫిక్స్ చేసిన కొరటాల?

0

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికే లాంచ్ కావాల్సి ఉన్నప్పటికీ ‘సైరా’ షూటింగ్ డిలే కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఫైనల్ గా ఈ సినిమా చిరంజీవి జన్మదినం సందర్భంగా ఆగష్టు 22 న లాంచ్ చేస్తారని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో చిరు సరసన నటించే హీరోయిన్ పై చాలా రోజులగా స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి కానీ కొరటాల మాత్రం హీరోయిన్ ను ఇప్పటికే ఫైనల్ చేశారట. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ను ఈ సినిమా కోసం ఎంపిక చేశారని సమాచారం. చిరంజీవికి జోడీగా నటించడం కాజల్ కు ఇది రెండవసారి. చిరు రీ ఎంట్రీ చిత్రం ‘ఖైది నెం.150’ లో కాజల్ చిరుతో ఆడిపాడింది. ఇప్పుడు మరోసారి అవకాశం రావడం గొప్ప విషయమే.

అయితే సీనియర్ హీరోలకు హీరోయిన్లను ఎంపిక చేసే విషయంలో డైరెక్టర్లకు ఎక్కువ ఆప్షన్స్ ఉండడం లేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో సీనియర్ హీరోయిన్ల వైపు దృష్టి సారించాల్సి వస్తోంది. ఇది కాజల్ లాంటి హీరోయిన్లకు వరంగా మారింది. ఫేడ్ అవుట్ అయిందని కామెంట్లు వినిపించేలోపు ఏదో ఒక క్రేజీ ప్రాజెక్ట్ కు సైన్ చేయడం.. విమర్శకులు అవాక్కవ్వడం కామన్ అయిపోయింది. ఇప్పుడు మరోసారి కాజల్ అలాంటి పనే చేస్తోంది. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్.. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer