బీర్లు తాగడంతో ఆ హిట్ మూవీ మిస్ చేసుకుందట

0

బాలీవుడ్ సౌత్ తో పాటు హాలీవుడ్ లో కూడా సినిమాలు చేసిన హాట్ హీరోయిన్ రాధిక ఆప్టే. సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే న్యూడ్ గా కూడా నటించేందుకు సిద్దంగా ఉండే రాధిక ఆప్టే కొన్ని సంవత్సరాల క్రితం ‘విక్కీ డోనర్’ అనే సినిమాకు ఎంపిక అయ్యిందట. ఆ సినిమాలో హీరోయిన్ గా రాధికను కాకుండా యామీ గౌతమ్ ను తీసుకోవడం జరిగింది. ఆ సంఘటనపై తాజాగా నేహా దుపియా టాక్ షోలో ఆసక్తికర విషయాలను రాధిక ఆప్టే చెప్పుకొచ్చింది.

ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన ‘విక్కీ డోనర్’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ చిత్రంలో హీరోయిన్ గా మొదట రాధిక ఆప్టేను ఎంపిక చేయడం జరిగింది. అయితే షూటింగ్ కు కాస్త సమయం ఉండటంతో హాలీడే ట్రిప్ నిమిత్తం నెల రోజులు విదేశాలకు రాధిక ఆప్టే వెళ్లిందట. హాలీడేస్ లో ఎక్కువగా బీర్లు తాగడంతో పాటు.. డైట్ మెయింటెన్ చేయక పోవడంతో మరీ ఎక్కువ లావు అయ్యిందట. దాంతో రాధిక ఆప్టేను సినిమా నుండి తొలగించడం జరిగిందట.

ఆ సమయంలో నేను వారిని కాస్త సమయం ఇస్తే బరువు తగ్గి వస్తాను.. షూటింగ్ ప్రారంభం అయ్యే సమయానికి బరువు తగ్గుతాను అంటూ రిక్వెస్ట్ చేసినా కూడా ఒప్పుకోలేదంటూ రాధిక ఆప్టే చెప్పుకొచ్చింది. బీర్లు తాగి బరువు పెరగడంతో ఆ మంచి సినిమాను మిస్ చేసుకున్నానంటూ రాధిక ఆప్టే చెప్పుకొచ్చింది.

అప్పుడు ఆయుష్మాన్ ఖరానాతో నటించే అవకాశం కోల్పోయిన రాధిక ఆప్టే ఇటీవల ‘అంధదున్’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండియాలోనే కాకుండా ఈ చిత్రం ఇతర దేశాల్లో కూడా భారీగా వసూళ్లు రాబట్టింది.
Please Read Disclaimer