కమల్ ఫ్యాన్స్ కి హీరొయిన్ ఖంగారు

0

లోక నాయకుడు కమల్ హాసన్ ఇండియన్ 2లో రకుల్ ప్రీత్ సింగ్ చేరిపోయింది. షూటింగ్ జరుగుతున్నప్పటికీ ఎప్పటిలాగే దర్శకుడు శంకర్ అప్ డేట్స్ బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు. 23 ఏళ్ళ క్రితం చరిత్ర సృష్టించిన భారతీయుడు సీక్వెల్ కావడంతో అంచనాలు మాములుగా లేవు. అయితే ఇప్పుడు రకుల్ ఎంట్రీనే కమల్ ఫ్యాన్స్ ని ఖంగారు పెడుతోంది. కారణం గత కొంతకాలంగా రకుల్ నటించిన సినిమాలేవీ డిజాస్టర్ కు తక్కువ స్థాయిలో ఆడలేదు మరి.

మొన్నటికి మొన్న చేసిన మన్మథుడు 2 గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సుమారు 60 శాతం దాకా బయ్యర్లు నష్టం చవిచూశారు. దాని కన్నా ముందు సూర్య ఎన్జికె దీనికి ఏ మాత్రం తీసిపోని ఫలితం అందుకుంది. ఇక కార్తీ దేవ్ గురించి ఎన్టీఆర్ కథానాయకుడులో వేసిన క్యామియో గురించి మాట్లాడుకోకపోవడమే బెటర్. వీటి ముందు చేసిన తెలుగు స్ట్రెయిట్ మూవీస్ స్పైడర్ – జయ జానకి నాయక ఫలితాలు తెలిసిందే.

మధ్యలో వచ్చిన హిందీ మూవీ దే దే ప్యార్ దే జస్ట్ పర్వాలేదు అనిపించుకుంది కానీ అదీ చెప్పుకునేంత గొప్ప సక్సెసూ కాదు. ఈ లెక్కన రకుల్ కు కెరీర్ మొదట్లో వచ్చిన బ్యాడ్ పీరియడ్ మళ్ళీ రిపీట్ అవుతోంది. ఇప్పుడీ ఇండియన్ 2 తనకు బ్రేక్ ఇస్తుందా లేక నెగటివ్ సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తుందా అనేదే కమల్ అభిమానులను టెన్షన్ పెడుతున్న అంశం.

ఇందులో రకుల్ కమల్ కు జోడిగా చేస్తోందా లేక ఇంకో హీరో ఎవరైనా అతని సరసన కనిపిస్తుందా లాంటి విషయాల గురించి క్లారిటీ లేదు. వచ్చే సమ్మర్ కు రిలీజ్ ప్లాన్ చేసిన ఇండియన్ 2 ఆఫర్ పట్ల రకుల్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. దీని కోసమే బల్క్ డేట్స్ కూడా ఇచ్చిందట. ఇదంతా ఓకే కానీ గత కొంత కాలంగా వెంటాడుతున్న పరాజయాల నీడ ఇండియన్ 2తో నైనా వదులుతుందో లేదో చూడాలి.
Please Read Disclaimer