పెళ్లి గిల్లీ లేదు అంటూ హ్యాండిచ్చిన జై!

0

తెలుగు హీరోయిన్ అంజలి- తమిళ్ హీరో జై ప్రేమించుకున్నారని..పెళ్లికి బాజా మోగనుందని చాలాకాలంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే బెలూన్ చిత్ర నిర్మాత ఆ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరు ఒకే గదిలో సహజీవనం చేశారని.. షూటింగ్ కు సైతం డుమ్మా కొట్టి వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకునే వారని సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆ కథనాలకు మరింత బలం చూకూరింది. అంజలి విషయంలో సెట్స్ లో అంతా మర్యాదగా నడుచుకోవాలని లేదంటే హీరోగారు వార్నింగ్ లు ఇచ్చేవాడని సదరు నిర్మాత పబ్లిక్ గానే వెల్లడించాడు.

ఆరోపణల్ని నిజం చేస్తూ.. అంజలి గానీ.. జై కానీ ఏనాడూ వాటిని ఖండిచే ప్రయత్నం చేయకపోవడంతో ఇదంతా నిజమే అని నమ్మాల్సొచ్చింది. అయితే ఇంతలోనే ఊహించని ట్విస్టు. ఈ కోద్ది రోజుల్లోనే ఆ ఇద్దరూ మనస్పర్థల కారణంగా ఆ ప్రేమకు పుల్ స్టాప్ పెట్టేసినట్లు కథనాలొచ్చాయి. తాజాగా వీటన్నింటిపై జై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసాడు. అంజలితో ఎలాంటి ప్రేమ గానీ.. ఎఫైర్ గానీ లేదు. ప్రేమిస్తున్నట్లు.. పెళ్లి చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని అనడం షాక్ కి గురి చేస్తోంది. త్వరలోనే నేను మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నా. అంజలితో నా ప్రేమ నిజమో అబద్దమో అప్పుడే మీకే అర్ధమవుతుంది అంటూ అతడు అసహనం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది.

అయితే బెలూన్ నిర్మాత ఆరోపణలు చేసిన కొద్ది రోజులుగా జై మీడియా ముందకు రావడం కోలీవుడ్ సహా టాలీవుడ్ లోనూ ఆసక్తికరంగా మారింది. అంజలి-జై మధ్య ఎఫైర్ సాగుతోందని రెండు మూడేళ్లగా ప్రచారంలో ఉంది. కానీ ఇంతకుముందు ఎప్పుడూ స్పందించని సదరు హీరో ఉన్నట్టుండి బెలూన్ నిర్మాత వ్యాఖ్యలతో మీడియా ముందుకు రావడం వెనక అసలు కారణం ఇంకేదైనా ఉందా? అంటూ కోలీవుడ్ మీడియాలో కథనాలొస్తున్నాయి.
Please Read Disclaimer