సుశాంత్ : నీవే నా జీవితానికి హీరో అంటూ హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్

0

సుశాంత్ ఆత్మహత్యపై అనేక వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది రియా చక్రవర్తిని టార్గెట్ చేశారు. ఆమెను ఎంతో అభిమానించి ప్రేమించిన సుశాంత్ ను మోసం చేసి ఉంటుంది. లేదంటే అతడి ప్రేమను తిరష్కరించి ఉంటుంది. అందుకే సుశాంత్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అంటూ నెటిజన్స్ అభిప్రాయ పడ్డారు. అందుకే రియా చక్రవర్తిని సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు. నువ్వు కూడా ఆత్మహత్య చేసుకో లేదంటే రేప్ చేసి చంపేస్తాం అన్నంతగా ఆమెను బెదిరించారు.

ఒక వైపు సుశాంత్ అభిమానుల సోషల్ మీడియా ట్రోల్స్ మరో వైపు పోలీసు ఎంక్వౌరీతో రియా చక్రవర్తి బాగా నలిగి పోయింది. ఒకానొక సమయంలో ఆమె తీవ్ర డిప్రెషన్ కు గురయ్యింది. సుశాంత్ మరణంపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసి చాలా మంది పోస్ట్ పెట్టారు. కాని రియా చక్రవర్తి మాత్రం సోషల్ మీడియాలో స్పందించలేదు. దాంతో ఆమెను టార్గెట్ చేశారు. సుశాంత్ మరణం షాక్ తోనే ఆమె ఆ కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండి పోయింది. ఇప్పుడు వరుసగా సుశాంత్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా సుశాంత్ నటించిన చివరి చిత్రం దిల్ బేచారా చిత్రం విడుదల సందర్బంగా కూడా అతడిని రియా గుర్తు చేసుకుంది.

నిన్ను చూసిన సమయంలో నాలోని ప్రతి అణువు ఉత్తేజితం అవుతుంది. నీవు నాతోనే ఉన్నావని నాకు తెలుసు. నేను నీతో గడిపిన క్షణాలను సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాను. నీ ప్రేమను ఆస్వాదిస్తూ జీవితాన్ని గడుపుతున్నాను. నీవే నా జీవితానికి హీరోవు. మాతో పాటు ఈ సినిమాను నువ్వు కూడా చూస్తావని ఆశిస్తున్నాను అంటూ దిల్ బేచారా చిత్రం పోస్టర్ ను షేర్ చేసింది. రియా చక్రవర్తి ఎమోషనల్ పోస్ట్ వైరల్ అయ్యింది. దాదాపుగా నాలుగు లక్షల లైక్స్ రాగా 20 వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి.