పవర్ స్టార్ కోసం సూపర్ హీరోయిన్ ఫిక్స్?

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో ఒక హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ‘అజ్ఞాతవాసి’ తర్వాత ఇప్పటికే దాదాపు రెండేళ్ళు గ్యాప్ వచ్చింది. దీంతో అభిమానులు ఆయన సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ తన పునరాగమనం కోసం ఒక పవర్ ఫుల్ సబ్జెక్ట్ ఎంచుకున్నారని అంటున్నారు.

ఈ సినిమాను సీనియర్ ప్రొడ్యూసర్ ఎఎం రత్నం నిర్మిస్తారని సమాచారం. పవన్ సినిమా నిర్మించేందుకు ఎఎం రత్నం చాలా ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు. చాలాకాలం క్రితమే పవన్ కు సినిమా కోసం ఎడ్వాన్స్ కూడా ఇచ్చారట. అందుకే పవన్ మొదటి ప్రిఫరెన్స్ రత్నంగారికే ఇస్తున్నారట. ఇక ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే పవన్ సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతారను అనుకుంటున్నారట. ఈ దిశగా చర్చలు కూడా మొదలయ్యాయని సమాచారం.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయని అంటున్నారు. వీలైనంత త్వరలో ఈ సినిమాను లాంచ్ చేసే ప్రయత్నాలలో ఉన్నారట. పవన్ సినిమాకోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులకు కూడా ఇది సూపర్ న్యూసే మరి.
Please Read Disclaimer