అసురన్ కోసం ఆ హీరోయిన్ ఫిక్స్?

0

తమిళ సూపర్ హిట్ ఫిలిం ‘అసురన్’ ను తెలుగులో సీనియర్ నిర్మాత సురేష్ బాబు రీమేక్ చేస్తున్నారనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తారు. ఈ రీమేక్ బాధ్యతలను సురేష్ బాబు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు అప్పగించారు. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

ఈ సినిమాలో వెంకీకి జోడీగా మొదట అనుష్క శెట్టిని తీసుకుందామని అనుకున్నారట. కానీ కుదరకపోవడంతో వేరే హీరోయిన్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఫైనల్ గా శ్రియ శరణ్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంచుకున్నారని సమాచారం. హీరోయిన్ ఎంపిక పూర్తయింది కాబట్టి ఈ సినిమాకు ఇతర నటీనటులు.. టెక్నిషియన్ల ఎంపిక సాగుతోందట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి ప్రారంభిస్తారని సమాచారం.

ఇదిలా ఉంటే వెంకీ నటించిన ‘వెంకీమామ’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. మేనల్లుడు అక్కినేని నాగచైతన్యతో కలిసి నటించిన మల్టి స్టారర్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. అయితే రిలీజ్ డేట్ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
Please Read Disclaimer