మేకప్ మేన్ తో హీరోయిన్ స్నేహం.. టాక్ ఆఫ్ ది టౌన్!

0

కథానాయికల్లో ఎదిగినా ఒదిగి ఉండేది కొందరే. చాలామంది తలబిరుసు చూపించే వాళ్లేననే రూమర్ ఉంది. డౌన్ టు ఎర్త్ ఉండే వారు తక్కువ మంది. తల బిరుసు చూపించే నాయికలు స్నేహం గా ఉన్నారంటే అందుకు కొన్ని లెక్కలుంటాయి. కానీ కొంత మంది లో ఎలాంటి భేషజాలుండవు.. హిడెన్ ఎజెండా ఉండదు. దిగువ మధ్య తరగతి వారైనా స్నేహం కొనసాగిస్తారు. వాళ్లతో క్లోజ్ గా మూవ్ అవుతారు. ఇప్పుడిదంతా ఎందుకు అంటే.. అసలు విషయం లోకి వెళ్లాల్సిందే. యాంకర్ కం నటి రష్మీ గౌతమ్ బుల్లి తెర ప్రేక్షకుల కు బాగా సుపరిచితం. కథానాయిక గానూ సత్తా చాటే ప్రయత్నాల్లో ఉంది.

ఇప్పటి కే కొన్ని సినిమాల తో టచ్ లో ఉంది. ఇక రష్మీ కి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. యాంకర్లందరి లో హాట్ భామగా బుల్లి తెరపై వెలిగి పోతోంది. మరి ఆమెను అంత అందంగా చూపించేది ఎవరు? అంటే ఇంకెవరు.. తన పర్సనల్ మేకప్ మేన్ అని చెబుతోంది. అతని పేరు వేణు. రష్మీ పర్సనల్ మేకప్ డిజైనర్. రష్మీ ఎక్కడుంటే అక్కడ వేణు ఉంటాడు. తనను అందం గా చూపించడమే వేణు పని. ఏడేళ్లుగా రష్మిని అందంగా చూపించడం లో అతనిది కీలక పాత్ర అని తెలుస్తోంది. వేణుని కేవలం ఒక ఉద్యోగి గా మాత్రమే కాకుండా కుటుంబం లో ఓ సభ్యుడి గా చూస్తానని తెలిపింది.

తన ఇంట్లో ఏ వేడుక జరిగినా వేణు ఫ్యామిలీ మెంబర్ అయిపోతాడట. మేకప్ విషయం లో ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ గా ఉంటాడట. వేణు ప్రయోగాల ను ఎంతో ఇష్టపడతానని.. తన అభిప్రాయాలు.. ఇష్టా ఇష్టాలు అన్నీ వేణు కి బాగా తెలుసని మురిసిపోయింది రేష్మి. యాంకరింగ్ జాబ్ అంటే అంత ఈజీ కాదని.. ఒకేసారి నాలుగు ఎపిసోడ్లు కోసం గ్యాప్ లేకుండా రెండు రోజులు నిరంతరం పని చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఆ అలసట ఎక్కడా ముఖంలో కనిపించకుండా ఏడేళ్లు గా వేణు కాపాడుతున్నాడని కితాబిచ్చేసింది. ఇక వేణుని రేష్మి అన్నయ్యా అని పిలిచేస్తోంది.
Please Read Disclaimer